క‌విత‌కు ఈడీ నోటీసులు.. కేంద్రంపై మంత్రి మల్లారెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌

Hyderabad: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మూడోసారి సమన్లు జారీ చేయ‌డంపై ఆమె స్పందిస్తూ.. ఇది రాజ‌కీయ ప్రేరేపిత చ‌ర్య‌గా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో కవితను చివరిసారిగా ఈడీ ప్రశ్నించింది. ఎక్సైజ్ పాలసీ కేసును కూడా దర్యాప్తు చేస్తున్న సీబీఐ 2022 డిసెంబర్ 11న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ప్ర‌స్తుత ఈడీ నోటీసుల‌పై మంత్రి మ‌ల్లారెడ్డి స్పందిస్తూ కేంద్రంపై మండిప‌డ్డారు.
 

ED notices to Kalvakuntla Kavitha: Minister Mallareddy's satirical comments on Centre RMA

Minister Malla Reddy on ED notices to MLC Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో  బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మూడోసారి సమన్లు జారీ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి మ‌ల్లారెడ్డి కేంద్రం తీరుపై మండిప‌డ్డారు. సెటైరికల్‌ కామెంట్స్‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో  బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మూడోసారి సమన్లు జారీ చేయ‌డంపై ఆమె స్పందిస్తూ.. ఇది రాజ‌కీయ ప్రేరేపిత చ‌ర్య‌గా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో కవితను చివరిసారిగా ఈడీ ప్రశ్నించింది. ఎక్సైజ్ పాలసీ కేసును కూడా దర్యాప్తు చేస్తున్న సీబీఐ 2022 డిసెంబర్ 11న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ప్ర‌స్తుత ఈడీ నోటీసుల‌పై మంత్రి మ‌ల్లారెడ్డి స్పందిస్తూ కేంద్రంపై మండిప‌డ్డారు.

మీడియాతో మంత్రి మ‌ల్లారెడ్డి మట్లాడుతూ.. రాజ‌కీయంగా బీజేపీ నేత‌లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశార‌నీ, దీనిలో భాగంగానే కేంద్ర సంస్థ‌ల‌ను ఉప‌యోగించుకుని రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నార‌ని అన్నారు. త‌న‌పై కూడా కూడా ఐటీ దాడులు జరిగాయ‌నీ, చివ‌ర‌కు ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుసున‌నీ, రాజ‌కీయాల్లో అదొక పార్ట్‌ మాత్రమేనంటూ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తీరును ప్ర‌స్తావిస్తూ.. వాళ్ల చేతిలో ఐటీ, ఈడీ, సీబీఐలు మాత్రమే ఉన్నాయనీ, అందుకే ఇలా చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి మంత్రి మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) పాల‌న‌లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ది జ‌రిగింద‌ని తెలిపారు. తెలంగాణ మోడ‌ల్ తో యావ‌త్ భార‌తావ‌ని సీఎం కేసీఆర్ వైపు చూస్తోంద‌నీ, ఆయ‌న ప్ర‌ధాని కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని అన్నారు. రాష్ట్రంలోని ఐటీ రంగం గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధి సాధించింద‌నీ, ఐటీ న‌గ‌రంగా పిలుచుకునే బెంగ‌ళూరును సైతం మించిపోయామ‌ని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios