Huzurabad Bypoll: బిగ్ న్యూస్... హుజురాబాద్ లో ఈటల జమున నామినేషన్
హుజురాబాద్ ఉపఎన్నికు నోటిఫికేషన్ వెలువడం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున పేరిట ఇవాళ నామినేషన్ దాఖలు దాఖలయ్యింది.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll) లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajender) సతీమణి ఈటల జమున (Eatala Jamuna) పేరిట ఓ నామినేషన్ దాఖలయ్యింది. జమున తరుపున బిజెపి (BJP) నాయకుడు కనుకుంట్ల అరవింద్ ఓ సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేసారు.
అయితే ఈ నెల 8వ తేదీన ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారని... ముందుజాగ్రత్త కోసమే ఆయన భార్య జమున నామినేషన్ నామినేషన్ వేసారని బిజెపి వర్గాలు, ఈటల సన్నిహితులు చెబుతున్నారు. రాజేందరే బిజెపి తరపున పోటీలో నిలుస్తారని... జమున నామినేషన్ ముందుజాగ్రత్త మాత్రమేనని స్పష్టం చేశారు.
కానీ గతంలో ఈటల రాజేందర్ కాకుండా ఆయన సతీమణి హుజురాబాద్ లో పోటీలో నిలిచే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా తాజాగా జమున పేరిట నామినేషన్ దాఖలయ్యింది. అయితే ఇప్పటికే బిజెపి అదిష్టానం రాజేందర్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాబట్టి ముందుజాగ్రత్త కోసమే జమున నామినేషన్ అని స్పష్టమవుతున్నా ఎక్కడో అనుమానం మాత్రం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో వుంది. ఏదయినా కారణాలతో ఈటల రాజేందర్ పోటీనుండి తప్పుకుంటే జమున పోటీలో నిలుస్తారు.
read more Huzurabad Bypoll: తమ్ముడూ అంటూనే... తడిగుడ్డతో నా భర్త గొంతు కోసారు కేసీఆర్: ఈటల జమున (వీడియో)
ఇదిలావుంటే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన గత శుక్రవారమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేసారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్ చేరుకున్న గెల్లు మద్యాహ్నం హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. గెల్లు శ్రీనివాస్ వెంట ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగనున్నారు. ఆయన 6వ తేదీన నామినేషన్ వేయనున్నారు. చివరిరోజు అంటూ ఈ నెల 8వ తేదీన ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.