విద్యాశాఖ మంత్రి కడియం వెల్లడి
నిరుద్యోగులకు శుభవార్త... టీచర్ జాబ్ ల కోసం ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న యువత కు తెలంగాణ సర్కారు ఓ తీపి కబురును అందించింది.
రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఎంపీ బాల్క సుమన్ విద్యార్థి నాయకులతో కలసి ఈ రోజు కడియంను కలిశారు.
పోస్టుల భర్తీపై నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి మొత్తం 8792 ఉద్యోగాలతో 15 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పారని సుమన్ వెల్లడించారు.
