కొత్త వ్యాపారంలోకి అర్వింద్ తన మాతృమూర్తిచే ఓపెనింగ్ అవినీతి రహిత సమాజం కోసం మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన అర్వింద్
మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి, ప్రస్తుత టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తాను నిర్మించిన భవనంలో ప్రఖ్యాత సెంట్రల్ షాపింగ్ మాల్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని అర్వింద్ తల్లి ధర్మపురి విజయలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడం సంతోషకరంగా ఉందని అర్వింద్ పేర్కొన్నారు. అయితే తాను అవినీతి రహిత భారత దేశం నిర్మాణంలో భాగస్వామిగా కావాలంటూ పంద్రాగస్టు నాడు ఇచ్చిన పత్రికా ప్రకటనలకు అనూహ్య స్పందన వచ్చిందని అర్వింద్ వెల్లడించారు.

తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ అర్వింద్ ధన్యవాదాలు తెలిపారు. అయితే బిజెపిలో చేరే అంశంలో ఇంకా అర్వింద్ క్లారిటీ ఇవ్వలేదు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో అర్వింద్ బిజెపిలో చేరే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.
