Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో డ్రగ్స్ డీలర్ భరత్ అరెస్ట్: 15 గ్రాముల ఎండీఎంఏ సీజ్

హైద్రాబాద్ నగరంలో  డ్రగ్స్  విక్రయిస్తున్న భరత్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు. భరత్  నుండి  ఎండీఎంఏ  ను పోలీసులు సీజ్ చేశారు. 
 

Drug peddler arrested in hyderabad
Author
First Published Jan 24, 2023, 3:55 PM IST

హైద్రాబాద్  నగరంలో డ్రగ్ డీలర్  భరత్ ను  మంగళవారం నాడు హైద్రాబాద్ లో పోలీసులు అరెస్ట్  చేశారు.  హైదరాబాద్: నగరంలో  డ్రగ్ డీలర్  భరత్ ను  మంగళవారం నాడు  పోలీసులు అరెస్ట్  చేశారు.  గోవా, ముంబై,  డిల్లీల నుండి భరత్  డ్రగ్స్ తీసుకు వచ్చి విక్రయిస్తున్నారని పోలీసులు  చెప్పారు. భరత్ నుండి  15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను  పోలీసులు సీజ్   చేశారు.  కొన్నేళ్లుగా  భరత్  నగరంలో  డ్రగ్స్ విక్రయిస్తున్నారని  పోలీసులు గుర్తించారు.   భరత్ నుండి  డ్రగ్స్ ను  కొనుగోలు  చేస్తున్న  ఆరుగురిని   పోలీసులు గుర్తించారు.

హైద్రాబాద్ లో  డ్రగ్స్ సరపరా చేస్తూ  పలువురు ఇటీవల కాలంలో  పోలీసులకు చిక్కుతున్నారు.   డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై, డ్రగ్స్ తీసుకుంటున్న వారిపై  పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిఘాను పెంచింది.   సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో  డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న  ముఠాను పోలీసులు ఈ నెల  21న అరెస్ట్  చేశారు. ఈ ముఠాలో  సభ్యులపై గతంలో కూడా  కేసులు నమోదయ్యాయయన్నారు. 
రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్,  నందిగామల్లో  గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న  ముఠాను  పోలీసులు  2022 డిసెంబర్ 1వ తేదీన అరెస్ట్  చేశారు.  నలుగురు ముఠా సభ్యులు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు


 

Follow Us:
Download App:
  • android
  • ios