విషాదం : ఆటో నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి..
ఓ మహిళను కాపాడబోయి ఆటో నడుపుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు.
కొత్తగూడెం : ఉన్నట్టుండి కుప్పకూలి పోవడం.. ప్రాణాలు వదిలేయడం. కాస్త ఒత్తిడికి గురి కాగానే గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడం ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు చిన్నా, పెద్దా, ముసలి, ముతకల్ని బలి తీసుకుంటోంది.. ఎందుకువస్తుందో.. వచ్చింది గుండెపోటో కాదో తెలుసుకునే లోపే మనిషి ప్రాణాల్ని హరించి వేస్తోంది. దీంతో తేరుకునేలోపే అంతా జరిగిపోతోంది. ఈ క్రమంలోనే అలాంటి మరో ఘటన కొత్తగూడెంలో వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఆటో నడుపుతూ గుండెపోటుతో మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆటో నడుపుతూ ప్రమాదవశాత్తు టూ వీలర్ ను ఢీకొట్టాడు. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ మహిళ కింద పడింది. ఆమెకు గాయాలయ్యాయి. అది చూసిన ఆటో నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కిందపడిన మహిళకు సపర్యాలు చేశాడు. తన ఆటోలోనే ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందించేలా చేయడానికి ప్రయత్నించాడు. ఆమెను ఆటోలోకి ఎక్కించుకున్నాడు.
కామారెడ్డిలో విషాదం.. ఫోన్‌లో మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు, ఐదురోజుల్లో నాలుగో ఘటన
ఒక రెండు అడుగుల దూరం నడిపేడో లేదో అతడికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తెలంగాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే… ఈ ఘటనలో చనిపోయింది మణుగూరు మండలం కట్టమల్లారానికి చెందిన మోహన్ రావు (61). అతను జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్నాడు. తన పనిలో భాగంగా శుక్రవారం రోజు కూడా మధ్యాహ్నం.. రాయిగూడెం నుంచి ముగ్గురు ప్రయాణికులతో మణుగూరు బయలుదేరాడు.
ఇక అదే రాయిగూడెం గ్రామానికి చెందిన ముత్తమ్మ, సత్యం అనే దంపతులు కమలాపురం నుంచి టూ వీలర్ మీద రాయిగూడెం వస్తున్నారు. గ్రామ మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న వీరిద్దరి వాహనాలు చూసుకోకుండా ఢీకొన్నాయి. దీంతో బైక్ మీద వెనక కూర్చున్న ముత్తమ్మ కిందపడిపోయింది. తీవ్ర గాయాలయ్యాయి. అది చూసిన మోహన్ రావు, ఆటో లో ఉన్న మిగతా ప్రయాణికులు ఆమెకు సపర్యాలు చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ఆమెను మోహన్ రావు ఆటోలో కూర్చోబెట్టారు. యాక్సిడెంట్ వల్ల అప్పటికే మోహన్ రావు తీవ్ర ఆందోళన చెందాడు.
గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి.. కబడ్డీ ఆడుతూ ఒకరు, నిద్రలో మరొకరు..
ఈ ఒత్తిడితో ఒక రెండు అడుగులు ఆటో నడపగానే బండిలో అలాగే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఆటోలోని ప్రయాణికులు ముత్తమ్మ భర్త అతడిని కూడా వేరే ఆటోలో మణుగూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. గాయాల పాలైన ముత్తమ్మకు చికిత్స అందిస్తున్నారు. దీని మీద సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
కెనడాలో గుండెపోటుతో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని మృతి..