గుండెపోటుతో ఇద్దరు విద్యార్థులు మృతి.. కబడ్డీ ఆడుతూ ఒకరు, నిద్రలో మరొకరు..

గుండెపోటుతో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్నవయసు పిల్లలు హఠాత్తుగా మరణిస్తున్న ఘటనలు కలిచివేస్తున్నాయి. ఏపీలో ఓ ఇంటర్ విద్యార్థి నిద్రలో గుండెపోటుతో మరణించగా, మరో ఫార్మసీ విద్యార్థి కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయాడు. 

two students died at heart attack in andhrapradesh - bsb

పల్నాడు : గుండెపోటు చిన్న వయసు పిల్లల్లో కూడా పెనుశాపంగా మారుతోంది. ఉన్నట్లుండి కబళించివేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గుండెపోటుతో ఇద్దరు  యువకులు మృతి చెందడం.. విషాదాన్ని నింపింది. నిద్రలోనే గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. చికిత్స పొందుతూ వారంరోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. అయితే, ఈ యువకులిద్దరి వయసు 20 ఏళ్లలోపే కావడం విషాదం. వీరి మరణాలతో ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. ఫిరోజ్ ఖాన్ (17) అనే విద్యార్థి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందినవాడు. చిలకలూరిపేట లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.

సోమవారం రాత్రి కూడా ప్రతిరోజు లాగే కాసేపు చదువుకుని   పడుకున్నాడు. సోదరి ఫర్జానా కూడా ఆ పక్కనే పడుకుంది. అయితే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో హఠాత్తుగా పెద్ద గురక వినిపిస్తుండడంతో ఫర్జానాకు మెలుకువ వచ్చింది. చూస్తే ఫిరోజ్ ఖాన్  పెద్దగా గురక పెడుతున్నాడు. ఎంత లేపినా లేవలేదు. ఎప్పుడూ గురక పెట్టని తమ్ముడు అంతగా గురక పెడుతుండడంతో.. అనుమానం వచ్చి తల్లిదండ్రులను లేపింది. వారుకూడా వచ్చి అతడిని లేపి మంచినీళ్లు తాగించాలి అని చూసిన.. నీళ్లు లోపలికి పోలేదు. 

స్వామి వారి రథోత్సవంలో అపశ్రుతి.. భయంతో పరుగులు తీసిన భక్తులు

దీంతో బాధితుడిని హుటాహుటిన చిలకలూరిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఫిరోజ్ ఖాన్ ను పరీక్షించి… చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. ఆ విషయం విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఫిరోజ్ ఖాన్ బాగా చదువుకుంటాడని… అతనికి ఎలాంటి ఒత్తిడిలు లేవని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని  తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిరోజ్ ఖాన్ మెదడుకు,  గుండెకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోవడంతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు వైసీపీ యత్నం.. రేపో, ఎల్లుండో అవినాష్ రెడ్డి అరెస్ట్: అచ్చెన్నాయుడు

ఇక మరో ఘటనలో అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న తనూజ్ నాయక్ (19) మార్చి ఒకటో తేదీన కాలేజీలో కబడ్డీ ఆడుతూ  కుప్పకూలిపోయాడు. అది గమనించిన తోటి క్రీడాకారులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో బెంగుళూరుకు తరలించారు. వారం రోజులుగా బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం అర్ధరాత్రి తనూజ్ నాయక్ మృతి చెందాడు. 

అయితే తమ కుమారుడి మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తేల్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి కుటుంబం శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం ఈ అచ్చంపల్లి తండాకు చెందింది. వీరు కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. చదువుల్లో బాగా రాణిస్తూ,  ఆటల్లో కూడా ప్రవేశం ఉన్న కుమారుడు చిన్న వయసులోనే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios