కెనడాలో గుండెపోటుతో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని మృతి..

కెనడాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలంగాణకు చెందిన వైద్యవిద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది. పదిరోజుల క్రితం ఈ ఘటన జరగగా సోమవారం ఆమె మృతదేహం స్వస్థలానికి చేరింది. 

telangana medical student died of a heart attack in Canada - bsb

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అక్కడే గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పూజితా రెడ్డి (24)  అనే వైద్య విద్యార్థిని  కెనడాలో గుండెపోటుతో మృతి చెందింది. సోమవారం  ఆమె మృతదేహాన్ని స్వస్థతమైన మల్కాపూర్ (ఏ)కు తీసుకువచ్చారు. ఈ అకాల మరణంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు  ఇలా ఉన్నాయి.. మల్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి కూతురు పూజిత రెడ్డి. ఆమె కాకుండా ఆయనకి మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. 

అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి. వెంకట్ రెడ్డి పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. కూతురు పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో బిడిఎస్ చదువుకుంది. ఆ తర్వాత జనవరి 26న మెడిసిన్లో పీజీ చేసేందుకు కెనడా వెళ్ళింది. మొదట అక్కడ తన సోదరుడి ఇంట్లో కొద్దిరోజులు ఉంది. ఆ తర్వాత యూనివర్సిటీలోని హాస్టల్లో తన స్నేహితులలో పాటు గదిలో ఉంటుంది. పది రోజుల క్రితం హాస్టల్ గదిలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. అది గమనించిన గదిలోని మిగతావారు,స్నేహితులు, సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్.. పూర్తి వివరాలు..

అక్కడ చికిత్స పొందుతూ పూజిత రెడ్డి మృతి చెందారు. కాగా, ఆమె మృతదేహాన్ని సోదరుడు ఇండియాలోని తమ స్వగ్రామానికి తీసుకువచ్చాడు.  ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం ఎంతో ఆశగా విదేశాలకు వెళ్లి.. అక్కడే  తిరిగిరాని లోకాలకు వెళ్లడం తల్లిదండ్రులకు  తీరని శ్లోకాన్ని మిగిల్చింది. కుటుంబం సభ్యులు, బంధువులు, స్నేహితులు  ఆమె మృతి పట్ల తీవ్ర విషాదాన్ని ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios