కామారెడ్డిలో విషాదం.. ఫోన్‌లో మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు, ఐదురోజుల్లో నాలుగో ఘటన

కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆ జిల్లాలో గడిచిన ఐదు రోజుల్లో ఇది నాలుగో ఘటన

young man died heart attack in kamareddy district

అప్పట్లో గుండెపోటు అనే మాట చాలా అరుదుగా వినిపించేది... ఏ యాబై అరవయేళ్లు మీదపడిన వారే ఎక్కువగా గుండె పోటుకు గురయ్యేవారు. కానీ ప్రస్తుతం మారిన జీవనశైలి,అహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె పోటుకు గురవుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఆరోగ్యంగా వుంటూనే సడన్ గా రోడ్లపై వెళుతుండగానో, బహిరంగ ప్రదేశాల్లోనో హార్ట్ స్టోక్ కు గురవుతున్నారు చాలామంది. 

కొద్దిరోజుల క్రితం నిర్మల్‌లో అంద‌రూ సంతోషంలో మునిగివున్న స‌మ‌యంలో రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు కర్నూలు జిల్లా ఆదోనీలో జిమ్ చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుండెపోటుతో సాయి అనే యువకుడు మరణించాడు. తాజాగా కామారెడ్డిలో బుధవారం అలాంటి ఘటనే వెలుగుచూసింది. పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన గోనే సంతోష్ అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతూ.. కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే సంతోష్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గడిచిన ఐదు రోజుల్లో గుండెపోటుకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ALso REad: ఫిట్ గా ఉన్నవాళ్లకు కూడా గుండెపోటు ఎందుకు వస్తుంది?

ఇటీవల కాలంలో గుండె సమస్యలు పెరిగిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో హార్ట్ స్ట్రోక్ కు గురవుతున్న వారిని కాపాడేందుకు సకాలంలో సిపిఆర్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో సిపిఆర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్డియాక్ అరెస్ట్ గురైన వారికి సకాలంలో సీపీఆర్‌ అందించే ఉద్దేశ్యంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సిపిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రారంభించారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios