హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను  ఈ నెల 15వ తేదీ వరకు నిలిపివేయాలని తెలంగాణ  హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సోమవారం నాడు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, చిక్కుడు ప్రభాకర్  దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 10వ తేదీన తెలంగాణ హైకోర్టు సంచల ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 13 వ తేదీ వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

సచివాలయం కూల్చివేత పనులపై  సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.తెలంగాణ సచివాలయం కూల్చివేత విషయంలో కేబినెట్ వివరాలను సీల్డ్ కవర్లో అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివరాలను  ఇవాళ సాయంత్రం లోపుగా అందిస్తామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు.

సచివాలయం కూల్చివేతను ఎలా నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించారు. సచివాలయం కూల్చివేత వల్ల కాలుష్యం ఏర్పడుతోందని పిటిషనర్లు ప్రస్తావించారు.కరోనా నిబంధనలను పట్టించుకోకుండానే  సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని పిటిషనర్లు  ఆరోపించారు.

also read:జూలై 13 వరకు సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: తెలంగాణ హైకోర్టు ఆదేశం

సచివాలయం కూల్చివేత విషయంలో కేబినెట్ సబ్ కమిటి రిపోర్టు ఏమిటి, కేబినెట్ తీర్మాణం తదితర విషయాలను హైకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది జూన్ 30వ తేదీన సచివాలయం కూల్చివేత విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు.

పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ప్రభుత్వం వివరించింది.  ఈ నెల 15వ తేదీ లోపుగా సెక్రటేరియట్ కూల్చివేత పనులను నిలిపివేయాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.