తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 

హైకోర్టు కూల్చివేయవద్దని కోరుతూ చిక్కుడు ప్రభాకర్, ప్రోఫెసర్ విశ్వేశ్వరరాావు  దాఖలు చేసిన పిటిషన్ల పై శుక్రవారం నాడు హైకోర్టు విచారించింది. 2016 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా కూల్చివేతలు సరికాదని పిటిషనర్తల రపు న్యాయవాది హైకోర్టులో వాదించారు.

ఎన్జీటీ ఆదేశాలు, కరోనా నిబంధనలను పట్టించుకోకుండా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని పిటిషనర్  న్యాయవాది వాదించారు.అయితే పిటిషనర్ల న్యాయవాది వాదనతో ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఏకీభవించలేదు.

ఇప్పటికే సచివాలయం కూల్చివేత పనులు సగం పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొన్న తర్వాతే  కూల్చివేత పనులు ప్రారంభించినట్టుగా ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.అంతేకాదు ఆయా శాఖల నుండి అనుమతి తీసుకోకుండానే సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించారని పిటిషనర్లు ఆరోపించారు. సచివాలయం కూల్చివేత కారణంగా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్లు 

also read:గెలిచిన కేసీఆర్: సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

అయితే చిక్కుడు ప్రభాకర్, విశ్వేశ్వరరాావు న్యాయవాది వాదనతో ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఏకీభవించలేదు. ఇప్పటికే సచివాలయం కూల్చివేత పనులు సగం పూర్తయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకొన్న తర్వాతే  కూల్చివేత పనులు ప్రారంభించినట్టుగా ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.