Asianet News TeluguAsianet News Telugu

దయ్యాల మాదిరిగా ఉన్నారు:డాక్టర్ ప్రియాంక రెడ్డి చివరి ఫోన్ కాల్ ఇదే

డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకు ముందు తన సోదరితో మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

 

Doctor Priyanka Reddy:Here is Last phone conversation with her sister
Author
Hyderabad, First Published Nov 30, 2019, 10:20 AM IST

హైదరాబాద్: గ్యాంగ్‌రేప్‌కు గురైన డాక్టర్ ప్రియాంక రెడ్డి  ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. అయితే తన బైక్‌ రాగానే ఇంటికి వెళ్లిపోవచ్చిన భావించింది. అయితే పథకం ప్రకారమే బైక్‌ను దుండగులు పంక్చర్ చేసిన విషయాన్ని ఆమె పసిగట్టలేకపోయింది. తన అనుమానాన్ని ఆమె పోలీసులకు చెబితే పరిస్థితి మరోలా ఉండేదేమోననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిని నలుగురు దుండగులు దారుణంగా రేప్ చేసి దహనం చేశారు. అయితే గచ్చిబౌలికి ఆమె వెళ్లే సమయంలో ప్రతి రోజూ టోల్ ప్లాజా వద్ద తన బైక్ పార్క్ చేసేది. అయితే టోల్ ప్లాజా వద్ద బైక్ ను పార్క్ చేస్తే పోలీసులు బైక్ ను తీసుకెళ్తున్నారని స్థానికంగా పనిచేసే వ్యక్తి చెప్పినట్టుగా ప్రియాంక రెడ్డి తన సోదరికి ఫోన్ లో వివరించింది.

గచ్చిబౌలి నుండి వచ్చి తన బైక్ ను తీసుకొని ఇంటికి వెళ్లే సమయంలో నలుగురు నిందితుల్లో ఒకరు ఆమెను పిలిచి మేడం మీ బైక్ పంక్చర్ అయిందని చెప్పాడు.అయినా కూడ ప్రియాంకరెడ్డి అలానే బైక్ ను ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆ నలుగురిలో ఓ యువకుడు వచ్చి బైక్ ముందుకు వెళ్లలేదు. పాడైపోతోందని డాక్టర్ ప్రియాంకరెడ్డిని నమ్మించాడు.

Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

ఈ మాటలను ప్రియాంకరెడ్డి మొదట్లో పట్టించుకోలేదు. బస్టాండ్ వరకు తన బైక్ వెళ్తే అక్కడ పంక్చర్ వేయించుకొంటానని ఆమె ఆ యువకుడికి చెప్పింది.కానీ ఆ యువకుడు మరోకరికి బైక్ ఇచ్చి పంక్చర్ చేయించుకురావాలని చెప్పాడు.

ఆ యువకుడు బైక్ ను తీసుకెళ్లి పంక్చర్ దుకాణం మూసివేసి ఉందని తిరిగి వచ్చాడు. పంక్చర్ దుకాణం మూసివేసి ఉందని వచ్చి మరో దుకాణం ఇక్కడికి దగ్గర్లోనే ఉందని చెప్పి మళ్లీ ఆ బైక్ ను తీసుకెళ్లాడు. 

ఈ సమయంలోనే డాక్టర్ ప్రియాంకరెడ్డి మనసు కీడును శంకించింది. ఇదే విషయమై తన సోదరికి ఆమె ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పింది.బైక్ ను తీసుకెళ్లి పంక్చర్ చేయించుకొని వస్తానని చెప్పారని.. తనను వెళ్లకుండా బైక్ పంక్చర్ చేయించుకొని వస్తారని ప్రియాంక రెడ్డి సోదరికి వివరించింది.

లారీలో ఉన్న వారిని చూస్తే తనకు భయం అవుతోందని సోదరికి చెప్పింది. అయితే ఆ సమయంలో సోదరి ప్రియాంక రెడ్డి ఓ సలహా ఇచ్చింది. ఆ సలహా విన్నా ప్రియాంకరెడ్డి బతికేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

AlsoRead చంపేశాక కూడా వదల్లేదు... ప్రియాంక రెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు...

టోల్‌ప్లాజా వద్ద వెళ్లి నిలబడాలని ప్రియాంకరెడ్డికి సోదరి సూచించింది. అయితే టోల్‌ప్లాజా వద్ద నిలబడితే అందరూ తననే చూస్తారని కూడ ఆమె చెప్పింది. ఈ తరుణంలోనే ఆమె అక్కడే నిలబడింది. అయితే తన బైక్ వచ్చే వరకు తనతో మాట్లాడుతూ ఉండాలని సోదరిని కోరింది.కానీ ఆమె మరో ఐదు నిమిషాల తర్వాత మాట్లాడుతానని ప్రియాంకరెడ్డికి చెప్పింది.ఈ సమయంలోనే ఫోన్ కట్ అయింది. 

ఫోన్ సంభాషణలో నిందితులను ఆమె దయ్యాలుగా ఉన్నారని ఆమె తన సోదరికి వివరించారు.  తాను చెప్పినా వినకుండా తన బైక్ ను దయ్యాల మాదిరిగా తీసుకెళ్లారని ఆమె తన సోదరికి వివరించింది.

ఆ తర్వాతే నిందితులు ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.డాక్టర్ ప్రియాంక రెడ్డి చివరి ఫోన్ కాల్ అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోన్ సంభాషణ వైరల్ గా మారింది.

ఈ సంభాషణ విన్న వారికి ప్రియాంక రెడ్డి ఆ సమయంలో ఏ రకమైన భయాన్ని అనుభవించిందో అర్ధమౌతోంది. మనసులో భయం ఉన్నప్పటికీ నిందితులకు ఆ విషయాన్ని కనబడకుండా జాగ్రత్త పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios