హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో తన కొడుకు ఏం చేశాడో తెలియదని ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ పాషా  తల్లి స్పష్టం చేశారు. మహ్మద్ పాషా హైదరాబాద్ లో లారీ నడుపుతూ ఉంటారని తెలిపాడు. 

ఆ లారీ కొడుకు కూడా తనకొడుకుది కాదన్నారు. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన రోజు అర్థరాత్రి 12గంటలకు ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అయితే తెల్లవారు జామున 3గంటలకు పోలీసులు వచ్చి తన కుమారుడి గురించి పోలీసులు ఆరా తీశారని తెలిపారు. 

ప్రియాంకరెడ్డి హత్య కేసులో తన కొడుకు ఏం చేశాడో తెలియడం లేదని తెలిపారు. ఏదో జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తనను తన కొడుకు దగ్గరకు తీసుకెళ్లాలి అంటూ మీడియా సోదరులను వేడుకున్నారు పాషా తల్లి. 

ప్రియాంకరెడ్డిపై గ్యాంగ్ రేప్, విచారణలో దారుణ విషయాలు: నిందితుడి ఫోటో రిలీజ్.

ముందే స్కూటర్ పంచర్ చేసి... ప్రియాంక రెడ్డి కేసును చేధించిన పోలీసులు