‘పంది’ బంధం

director ravibabu with pig
Highlights

  • డైరెక్టర్ రవిబాబు వినూత్న ప్రచారం
  • ఏటిఎం వద్ద పందితో కలసి క్యూ

పవిత్ర బంధం తెలుసు కాని ఈ పంది బంధం ఏంటి.. స్పెల్లింగ్ మిస్టేక్ అని మాత్రం అనుకోకండి.డైరెక్టర్ రవిబాబు ఏం చేసినా కాస్త విచిత్రంగానే ఉంటుంది. ఆయిన మొదటి సినిమా అల్లరి నుంచి మొదలు పెడితే అన్ని కూడా భిన్నమైన చిత్రాలే.ప్రచారంలోను రవిబాబు తనకంటూ ఒక ఢిపరెంట్ స్టైల్ మెయిటేయిన్ చేస్తుంటారు.

 

పోస్టర్ మీద సినిమాలోని  హీరోహీరోయిన్ బొమ్మలు లేకుండానే జనాలను థియేటర్ కు క్యూ కట్టించిన వెరైటీ డైరెక్టర్ రవిబాబు.. ఇప్పుడు ఆయన కూడా క్యూ లో నిలబడ్డారు.అది అందరిలా కాదు.. అలా నిలబడితే డైరెక్టర్ రవిబాబు ఎందుకు అవుతాడు చెప్పండి.

 

తన రాబోయే సినిమా పంది పిల్లతో తీస్తున్నాడు. ఆ సినిమాలో మెయిన్ హీరో కూడా అదే.అందుకే గత ఏడాదిగా ఆ పంది పిల్లతో రవిబాబుకు బాగా అటాచ్ మెంట్ ఏర్పడింది. ఎక్కడి వెళ్లినా దాన్ని వదలడం లేదు.

 

ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటిఎంకు వచ్చిన రవిబాబు వెంట పందిపిల్లను కూడా తీసుకొచ్చాడు. ఇలా ఏటిఎం ముందు పందితో క్యూ లో నిలబడి డబ్బులు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు. పనిలో పనిగా తన సినిమా హీరోను జనాలకు కూడా పరిచయం చేశాడు. పైసా ఖర్చు లేకుండా తన సినిమా గురించి జనాలు చెప్పుకునేటట్లు చేశాడు.

 

loader