Asianet News TeluguAsianet News Telugu

ఆయనకు 80 ఏళ్లు.. ఇక విశ్రాంతినిద్దాం : వనమాపై డీహెచ్ శ్రీనివాస్ విమర్శలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మీద డాక్టర్ డిహెచ్ శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఆయనకు సెలవిద్దాం అంటూ మాట్లాడారు. 

DH Srinivasa rao sensational comments on MLA Vanama venkateshwara rao - bsb
Author
First Published May 22, 2023, 3:46 PM IST

కొత్తగూడెం : తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ డిహెచ్ శ్రీనివాసరావు ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల్లో డిహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెం నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

ఆయన మీద జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్టుగా ఉన్నాయి. అంతేకాదు, ఆయన వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి. పాల్వంచ మండలంలో పర్యటించిన డిహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వర్లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఆయనకు 80 ఏళ్లు అని.. దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని.. చాలా పెద్దవారు అయిపోయారని.. ఆయనకిక విశ్రాంతినిద్దాం అంటూ..  డిహెచ్ వ్యాఖ్యానించారు. తాను హాజరైన సభకు చాలా తక్కువ మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారని..  తను ప్రజల్ని కలిసేందుకు వచ్చానని.. మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా.. ఉద్యోగులందరికీ 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ఇచ్చేస్తారని.. మన స్థానిక ప్రజాప్రతినిధికి 80ఏళ్లని..  ఇప్పటికే ఆయన చాలా కాలం ప్రజాసేవ చేశారని చెప్పుకొచ్చారు. 

హైద్రాబాద్‌ పలు చోట్ల ఈడీ అధికారుల సోదాలు: సాహితి ఇన్‌ఫ్రా సంస్థల్లో తనిఖీలు

ఆయన నియోజకవర్గానికి చాలా సేవ చేశారని…ఆయనకు కాస్త రెస్ట్ ఇద్దామని అన్నారు. గత ఎన్నికల్లో  ఇవే తన చివరి ఎన్నికలని… ఒకసారి అవకాశం ఇవ్వమని అడిగారు. ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. ఎన్నిసార్లు అవకాశాలు ఇస్తాం. ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలి. గడల శ్రీనివాస్ కార్యక్రమానికి వస్తే అది కట్ చేస్తా,  ఇది కట్ చేస్తా..  ఉన్న పదవి పీకేస్తా…దళిత బంధు రాకుండా చేస్తా.. ఇంకేదో స్కీం కట్ చేస్తా అనేది ఎంతకాలం నడుస్తుంది.. ఇంకా నాలుగు నెలలు మాత్రమే.

కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఎందుకంటే ఈ మాటలు నేను  బాధతో చెబుతున్నా.. నా మనుషులున్ని, నా కుటుంబ సభ్యుల్ని నా దగ్గరికి రాకుండా చేస్తున్నారనే బాధతో చెబుతున్నా.. అని చెప్పుకొచ్చారు. కొత్తగూడెంలోని ప్రతీ ఒక్కరినీ ఇలాగే బెదిరిస్తున్నాడు. ఇక్కడికి వచ్చినవారెవ్వరూ ఒక్క రూపాయి కూడా తీసుకుని వచ్చినవారు కాదు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటా అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios