హైదరాబాద్ డీఆర్ డీఎల్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి హనీట్రాప్ లో చిక్కుకున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన ఆమెకు దేశరహస్యాలు చేరవేశాడు.
హైదరాబాద్ : honeytrapలో పడి దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ISI మహిళా ఏజెంట్ కు చేరవేస్తున్న Contract employeeని ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం(SOT), బాలాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన దుక్కా మల్లికార్జున్రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు (29) ఇంజినీరింగ్ పూర్తయ్యాక స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసి 2018లో పటాన్చెరువులోని క్వెస్ట్ కంపెనీలో చేరాడు. ఈ సమయంలో క్వెస్ట్ కీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీ (డీఆర్డీఎల్) నుంచి ఒక ప్రాజెక్టు వచ్చింది. ఈ ప్రాజెక్టు మీద 2020 జనవరి వరకు పనిచేశాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఫిబ్రవరిలో మల్లికార్జున్ రెడ్డి నేరుగా డిఆర్డిఎల్ అధికారులను సంప్రదించి అడ్వాన్స్ నావెల్ సర్వీస్ ప్రొవైడర్ (ఏఎన్ఎస్ పి) ప్రాజెక్టులో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు.
ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి..
ఈ క్రమంలో మల్లికార్జున్రెడ్డి డిఆర్డిఎల్ లో పని చేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రొఫైల్లో స్టేటస్ పెట్టుకున్నాడు. 2020 మార్చిలో మల్లికార్జున పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న నటాషారావు అలియాస్ సిమ్రన్ చోప్రా అనే మహిళ నుంచి ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో యాక్సెప్ట్ చేశాడు. అలా స్నేహం పెంచుకున్న నటాషా రావు, మల్లికార్జున్ చేస్తున్న వృత్తి, పని ప్రదేశం, కంపెనీ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. మల్లికార్జున్ రహస్య సమాచారాన్నికూడా నటాషా రావుకు చేరవేశాడు. అంతే కాకుండా మల్లికార్జున్ తన బ్యాంకు ఖాతా నెంబరు ఇతరత్రా వివరాలను నటాషా పంపించాడు. ఈ నేపథ్యంలో డిఆర్డిఎల్ రహస్యాలు లీక్ అవుతున్నాయని సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటి, బాలాపూర్ పోలీసులు మల్లికార్జున్ ను మీర్పేట్ త్రివేణి నగర్ లో అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, సిమ్ కార్డు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.
పాక్‌కు ఆర్మీ రహస్యాలు చేరవేసిన రాకేష్‌కు నగదు: జగిత్యాల లింగన్న అరెస్ట్
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో బెంగళూరులో ఇలాంటి హనీట్రాప్ కేసే బయటపడింది. ఓ జాతీయ పార్టీలో రాష్ట్రస్థాయి నాయకురాలు. మంచి హోదాలో ఉన్న ఆమె విధ పార్టీల నాయకులకు వలపు వల విసిర దగ్గరై ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి భారీ డబ్బులు వసూలు చేసేది. అలా ఓ కాంట్రాక్టర్ తో కూడా దగ్గరై డబ్బులు డిమాండ్ చేయడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సదరు మహిళా నేత అసలురంగు బయటపడింది.
వివరాల్లోకి వెళితే... కర్ణాటక కొప్పళ్ ప్రాంతానికి చెందిన ఓ జాతీయపార్టీ నాయకురాలు రాజధాని బెంగళూరులో నివాసముంటోంది. ఆ జాతీయపార్టీ తమిళనాడు మహిళా విభాగం ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తుండేది. ఆమె రాజకీయంగా, ఆర్థికంగా మంచి స్థానంలో వున్న వారిని టార్గెట్ గా చేసుకుని హనీట్రాప్ చేసేది. మొదట టార్గెట్ ను ఎంచుకున్న తర్వాత అతడితో పరిచయం పెంచుకుని దగ్గరయ్యేది. ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడుపుతూ సీక్రెట్ గా ఫోటోలు, వీడియోలు తీసేది. ఆ తర్వాత తనతో కలిసున్న నగ్న ఫొటోలు, అసభ్యకర వీడియోలు బయటపెడతానంంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసేది. దీంతో తన రాసలీలల ఫోటోలు, వీడియోలు బయటకు వస్తే పరువు పోవడమే కాదు రాజకీయంగా కూడా దెబ్బతింటామని భావించి ఆమె అడిగినంత ఇచ్చేసేవారు.
