ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేసిన కేసులో అరెస్టైన రాకేష్ అనే వ్యక్తికి నగదును బదిలీ చేసిన లింగన్నను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై జమ్మూ కాశ్మీర్ కు తరలించారు.
జగిత్యాల: ఆర్మీ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేసిన కేసులో అరెస్టైన రాకేష్ అనే వ్యక్తికి నగదును బదిలీ చేసిన లింగన్నను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై జమ్మూ కాశ్మీర్ కు తరలించారు.
జమ్మూ కాశ్మీర్ లో పనిచేసే రాకేష్ అనే యువకుడు అనిత అనే యువతికి ఇండియాకు చెందిన ఆర్మీ సమాచారాన్ని చేరవేస్తున్నాడని ఈ ఏడాది జనవరి మాసంలో కేసు నమోదైంది. ఈ సమాచారం పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా ఆర్మీ గుర్తించింది.
రాకేష్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలకు వేర్వేరు వ్యక్తుల నుండి డబ్బులు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లాకు చెందిన లింగన్న కూడ రాకేష్ కు వేర్వేరు సమయాల్లో సుమారు రూ. 40 వేల నగదును పంపినట్టుగా గుర్తించారు.
గత నెలలో కూడ లింగన్నను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన పోలీసులు జగిత్యాలకు వచ్చి విచారించారు. మరో వైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు మరోసారి జగిత్యాలకు వచ్చారు. ట్రాన్సిట్ వారంట్‌పై లింగన్నను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి తీసుకెళ్లారు.
హానీ ట్రాప్ కారణంగానే రాకేష్ పాకిస్తాన్‌కు ఇండియాకు చెందిన ఆర్మీ సమాచారాన్ని చేరవేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలోనే భాగంగానే పోలీసులు లింగన్నను కూడ జమ్మూకు తీసుకెళ్లినట్టుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు.
