డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేదానిపై వివాదం ముదిరి కొట్టుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే కోమటి రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి తోసేసుకున్నారు.
తెలంగాణ లో అధికారం కోసం పోరాడటం మానేసిన ఇక్కడి కాంగ్రెస్ నేతలు తమలో తాము పోరాడుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు అంటే ఇంకా బాగుంటుందేమో... అవును నిజంగానే కొట్టుకుంటున్నారు.
ఈ రోజు గాంధీ భవన్ లో జిల్లాల వారిగా పార్టీకి సంబంధించి సమీక్షలు నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ స్వయంగా హాజరయ్యారు.
నల్లగొండ జిల్లా కు సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో అక్కడే నల్లగొండ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
అయితే కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ్ డీసీపీ పదవుల నిమాయకంపై చర్చ వచ్చినప్పుడు వివాదం చెలరేగింది.
ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేదానిపై వివాదం ముదిరి కొట్టుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే కోమటి రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి తోసేసుకున్నారు.
అక్కడున్న ఇతర నేతలు సముదాయించడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సమక్షంలోనే ఇలా జరగడంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తలపట్టుకున్నారు. పార్టీ బలంగా ఉన్న నల్లగొండ జిల్లాలో నేతల మధ్య సయోధ్య లేదని అధిష్టానానికి తెలిసేలా ఇద్దరు వ్యవహరించారని మండిపడ్డారు.
