Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో దారుణం.. పదేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి.. దేహశుద్ది..

భార్య అనారోగ్యం కారణంగా కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆ మృగాడు liquor తాగి ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో rape అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Minor girl sexually abused by father in ibrahimpatnam, hyderabad
Author
Hyderabad, First Published Nov 8, 2021, 8:36 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఇబ్రహీం పట్నం : కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండే ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేసి, అతడిని పోలీసులకు అప్పగించారు. 

ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ 12వ వార్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. 12వ వార్డులో నివాసం ఉండే ఓ 35యేళ్ల వ్యక్తికి భార్య, daughter (10), కుమారుడు ఉన్నారు. 

భార్య అనారోగ్యం కారణంగా కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆ మృగాడు liquor తాగి ఇంటికి వచ్చాడు. ఆ మత్తులో rape అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇలాంటి  ఘటనలు తరచుగా జరుగుతుండడం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే కూతుర్ల పాలిట కీచకులుగా మారుతున్నారు. వావివరసలు మరిచి కర్కశంగా కాటేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. వారి ఉసురు తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితం కావడం లేదు. ప్రతీ చోట ఇలాంటి దారుణాలే చోటు చేసుకోవడం గమనార్హం.

ఆస్పత్రికి తీసుకువెడతానని చెప్పి.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం...

పాకిస్తాన్ లో యేడాదిగా కూతురిపై లైంగికదాడి.. అడిగితే....

గతనెలలో పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో సభ్య సమాజం తలదించుకునేలాంటి ఇలాంటి ఘటనే జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయి... వావివరుసలు మరచి ఓ కన్నతండ్రి అకృత్యానికి పాల్పడ్డాడు. 

కామంతో కళ్లుమూసుకు పోయిన కన్నతండ్రి కన్న కూతురునే చెరబట్టాడు.  ఏడాది నుంచి బిడ్డపై తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు.  విషయం తల్లికి తెలిసింది.  కానీ భర్త కు వ్యతిరేకంగా పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఉంది.  దీంతో తన బిడ్డను కాపాడమంటూ Suicide attempt చేసింది.  ఈ సంఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది.  ఆ వివరాలు…

లాహోర్ కు చెందిన ఓ మహిళకు ఐదుగురు సంతానం. ఈ క్రమంలో కొన్ని  సంవత్సరాల క్రితం భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు భర్త దగ్గర ఉంటుండగా... ఇద్దరూ భార్యతో ఉంటున్నారు.  

కొద్ది రోజులు బాగానే గడిచినా.. ఆ తరువాత ఆ కసాయి కన్నతండ్రి కన్ను మైనర్ కూతురిపై పడింది. దీనికితోడు భార్య తన నుంచి విడిపోయిందన్న కక్ష తోడైంది. అంతే..Lustతో కళ్లు మూసుకుపోయిన తండ్రి ఏడాది నుంచి తన 15 ఏళ్ళ కుమార్తెపై sexual assaultకి ఒడిగడుతున్నాడు.

అంతేకాకుండా.. ఆ చిన్నారిని తీవ్ర బెదిరింపులకు లోను చేశాడు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనలకు గురైన minor girl మౌనంగా దారుణాన్ని భరిస్తూ వస్తుంది. భర్త చేస్తున్న దారుణం గురించి విడిపోయిన భార్యకు తెలిసింది. భర్తను  ‘ఏంటి పని..’ అని నిలదీసింది. కానీ నీచబుద్ధితో దుర్మార్గానికి ఒడిగడుతున్న ఆ భర్త చాలా దారుణాతి దారుణంగా సమాధానం ఇచ్చాడు. ‘ నా ఇష్టం.. పోలీసులకు చెప్పుకుంటావా..  చెప్పు.  జైలు నుంచి వచ్చాక  మళ్లీ  నీ బిడ్డలు అందరిపై 
Rape చేస్తాను’  అని బెదిరించాడు.

దీంతో ఆతల్లికి ఏం చేయాలో పాలు పోలేదు. అంతగా బరి తెగించిన భర్తనుంచి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు.  నీచుడైన ఆ భర్తకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అనుకూలించదు.  ఏం చేయాలో పాలుపోని Woman సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.  

ఈ క్రమంలో సదరు మహిళ Court of Sessionsలో Suicide attempt చేసింది. సజీవదహనం చేసుకోవాలని భావించింది.  కానీ చుట్టూ ఉన్నవారు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సెషన్స్ కోర్టు జడ్జి మహిళా భద్రత పై తగిన చర్యలు తీసుకోవాలని.. బాధిత బాలికకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios