హైద్రాబాద్ నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో  బుధవారంనాడు  గ్యాస్ సిలిండర్ పేలింది.  ఈ ఘటనలో  ఇల్లు కుప్పకూలింది.  

హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్ పల్లిలో బుధవారంనాడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

మైలార్ దేవ్ పల్లిలోని దుర్గానగర్ వద్ద రవిరంజన్ కుమార్ నివాసంలో ఇవాళ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.