Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక కేసులో వీడిన మిస్టరీ.. ఇలా చంపారు: మీడియాతో సీపీ సజ్జనార్

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువతులు అత్యసవర సమయాల్లో 100కు డయల్ చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

cyberabad police commissioner sajjanar press meet over dr priyanka reddy murder case
Author
Hyderabad, First Published Nov 29, 2019, 7:28 PM IST

ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువతులు అత్యసవర సమయాల్లో 100కు డయల్ చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఈ కేసులో ఏ1 నిందితుడు మహ్మద్ అలియాస్ ఆరిఫ్ (నారాయణ్ పేట జిల్లా మక్తల్ మండలం జక్కులూరు)ఏ2 శివ (మక్తల్ మండలం గుడిగుండ్ల), ఏ3 నవీన్ (మక్తల్ మండలం గుడిగండ్ల), ఏ4 చెన్నకేశవులు (మక్తల్ మండలం గుడిగండ్ల)కు చెందినవారని సీపీ వెల్లడించారు.

ప్రియాంకరెడ్డి హత్యపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి: లాయర్లు సాయం చేయోద్దు, ఉరిశిక్షే శాస్తి

28వ తేదీ సాయంత్రం 5.0 గంటలకు ప్రియాంక తన ఇంటి నుంచి బయలుదేరి, 6.08కి టోల్ ప్లాజా వద్దకు చేరుకుందన్నారు. అక్కడే బండి పార్క్ చేస్తుండగా నలుగురు నిందితులు ఆమెను చూశారని... అదే సమయంలో ప్రియాంకపై అత్యాచారం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారని సజ్జనార్ వివరించారు.

నవీన్ అనే వ్యక్తి స్కూటీ టైర్ గాలి తీస్తే ఆమె ఎక్కడికి వెళ్లలేదని మిగిలిన వారితో చెప్పి గాలి తీసేశాడని ఆయన వెల్లడించారు. రాత్రి 9.23 గంటలకు టోల్‌ప్లాజా వద్దకు రాగానే ఆరిఫ్ ప్రియాంక దగ్గరకి వెళ్లి మేడమ్ మీ స్కూటీ పంక్చర్ అయ్యిందని, సాయం చేస్తానని చెప్పి నమ్మించాడని సీపీ తెలిపారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వారికి 9.28కి స్కూటీ ఇచ్చిందని.. శివ అనే వ్యక్తి స్కూటీని రీపేర్ చేయించుకోస్తానని వెళ్లాడన్నారు. 9.30కి అతను తిరిగి వచ్చి పంక్చర్ షాపు మూసివేశారని చెప్పి మరో చోటికి వెళ్లాడని... ఈ క్రమంలో నవీన్, చెన్నకేశవులు ప్రియాంకను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని సజ్జనార్ చెప్పారు.

అనంతరం ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారని.. అదే సమయంలో ముక్కు, నోరు మూసేయడంతో ప్రియాంక ఊపిరాడక చనిపోయిందని ఆయన వెల్లడించారు. రాత్రి 10.28 గంటలకు ఆమె స్కూటీని అక్కడి నుంచి తీసుకెళ్లారని, 10.33కి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో వేసుకుని వెళ్లిపోయారని సీపీ తెలిపారు.

మృతదేహాన్ని తగులబెట్టేందుకు నందిగామలో పెట్రోల్ బంక్‌కి వెళ్లారని, అక్కడ పెట్రోల్ దొరక్కపోయేసరికి వేరే చోట కొన్నారని ఆయన చెప్పారు. ప్రియాంక మృతదేహాన్ని చటాన్‌పల్లి అండర్ పాస్ కింద పెట్రోల్ పోసి తగులబెట్టారని సజ్జనార్ చెప్పారు.

రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే...

ప్రియాంక కుటుంబసభ్యులు రాత్రి 11.25 గంటలకు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదును అందుకున్న వెంటనే పోలీసులు టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారని.. సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని సజ్జనార్ పేర్కొన్నారు.

ప్రియాంక మొబైల్ ఇంకా దొరకలేదని, వాహనాల కారణంగా ప్రియాంక అరుపులు వినిపించలేదన్నారు. మరోవైపు పోలీసుల స్పందనపై తల్లీదండ్రులు చేస్తున్న ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.

Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి

పోలీసులు తప్పు చేసినట్లు తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనాస్థలంలో బాధితురాలు 40 నిమిషాలు మాత్రమే ఉందని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు కీలకమైన ఆధారాలు ఇస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios