Asianet News TeluguAsianet News Telugu

‘నీకు అక్కా చెల్లెళ్లు లేరా? అమ్మాయిని వేధిస్తావా?’.. కేసు పేరుతో రూ.6.96 లక్షలకు టోకరా..

సెటిల్ మెంట్ చేసుకో... లేదంటే అరెస్ట్ తప్పదు. ఆ అమ్మాయితో మేం మాట్లాడతామంటూ కొందరు కేటుగాళ్లు పెద్ద మనుషులుగా వ్యవహరించి ఓ నిరుద్యోగి నుంచి రూ. 6.96 లక్షలు కాజేసిన వైనం వెలుగు చూసింది. 

cyber crime, rs 6.96 lakh in the name of the women harassment case in hyderabad
Author
Hyderabad, First Published Oct 8, 2021, 10:47 AM IST

హైదరాబాద్ : నీకెంత ధైర్యం.. నీకు అక్కా చెల్లెళ్లు లేరా? అమ్మాయిని వేధిస్తావా? ఇక నీ పని అయిపోయింది. భవిష్యత్తులో ఉద్యోగం రాదు. జీవితాంతం ఊచలు లెక్కపెడుతూనే ఉండాలంటూ బెదిరించారు. 

సెటిల్ మెంట్ చేసుకో... లేదంటే అరెస్ట్ తప్పదు. ఆ అమ్మాయితో మేం మాట్లాడతామంటూ కొందరు కేటుగాళ్లు పెద్ద మనుషులుగా వ్యవహరించి ఓ నిరుద్యోగి నుంచి రూ. 6.96 లక్షలు కాజేసిన వైనం వెలుగు చూసింది. ఈ కేసును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నువ్వు రాకపోతే పోలీసులే వస్తారు..
ఐడీఏ జీడిమెట్లకు చెందిన బాధితుడు (27) ఎంఎస్సీ చదివి ఉద్యోగాన్వేణలో ఉన్నాడు. రిక్రూట్ మెంట్ వెబ్ సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నాడు. కొన్ని రోజుల కింద crrccrime@gmail.com అనే ఐడీ నుంచి మెయిల్ వచ్చింది. మీరొక అమ్మాయిని వేధించారని.. మీ పైన 356(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

అమ్మాయితో ఉన్నట్లు బాధితుడి ఫొటోలను marphing చేశారు. యువతిని బెదిరించావని చెప్పారు. ఆ అమ్మాయి తనకు తెలియదంటూ బాధితుడు వాపోయాడు. అయినా సెప్టెంబర్ 10న మ. 12 గంటలకు తల్లిదండ్రులను తీసుకురావాల్సి ఉంటుందని హెచ్చరించారు. హాజరు కాకపోతే పోలీసులే వెతుక్కుంటూ వస్తారని తేల్చి చెప్పారు. 

టెలిగ్రాంలో చైల్డ్ పోర్నోగ్రఫీ... క్యూఆర్ కోడ్ తో డబ్బులు వసూలు.. టెకీ అరెస్ట్..

మెయిల్ చూశాక బాధితుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో స్నేహితుడిని  సలహా కోరాడు. అతడు అక్కడున్న నంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోమన్నాడు. దీంతో అతను సూచించనట్టే అక్కడున్న నెంబర్ కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోమన్నారు.

వాల్ల బంధువులు ఫోన్ చేస్తారని చెప్పారు. నలుగురు ఫోన్లు చేశారు. వాళ్లు అడిగినప్పుడల్లా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 3 మధ్య దఫదఫాలుగా రూ.6.96లక్షలు పంపించాడు. కేసు కొట్టేశారా? లేదా? అని తెలుసుకునేందుకు పోస్ట్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులు ఆశ్రయించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios