క్రికెట్ బెట్టింగ్: వందకోట్లు పోగొట్టుకున్న హైదరాబాదీ.. అశోక్‌రెడ్డి బెట్టింగ్ కథ ఇది !

IPL 2023-betting: క్రికెట్ బెట్టింగ్ లు చేస్తున్న అశోక్‌రెడ్డి అనే వ్య‌క్తి ఏకంగా 100 కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకున్నాడు. ఆయ‌న అడ్డ‌దారిలో డ‌బ్బు సంపాదించాల‌నే వారితో క‌లిసి ముఠాగా ఏర్ప‌డ్డారు. దాదాపు 12 ఏండ్ల కింద‌ట ఈ బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. క్రికెట్, హార్స్‌రైడింగ్ స‌హా అనేక క్రీడలపై బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నాడు. అయితే, ఇదే వ్య‌స‌నంగా మారి గ‌త 12 ఏండ్ల‌లో 100 కోట్లు పోగొట్టుకున్నాడు. 

Cricket betting: Hyderabadi who lost hundred crores.. This is the story of Ashok Reddy's betting RMA

Cricket Betting-ashok reddy: క్రికెట్ బెట్టింగ్ ల‌కు పాల్ప‌డుతూ స‌ర్వం కోల్పోయి రోడ్డున‌ప‌డ్డ వారి అనేక సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు అనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ప్ర‌భుత్వ ఆంక్ష‌లు, పోలీసులు క‌ఠిన చ‌ర్య‌ల‌ను లెక్క‌చేయ‌కుండా గుట్టుచ‌ప్పుడు కాకుండా సాగే ఈ దందా సంచ‌ల‌న ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి క్రికెట్ బెట్టింగులు పెట్టి ఏకంగా100 కోట్ల రూపాయ‌ల‌ను  పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ మాయ‌లో ప‌డి భారీ మొత్తంలో డ‌బ్బుకోల్పోయిన ఈ వ్య‌క్తి హైద‌రాబాదీ కావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. 

 తాజా క్రికెట్ బెట్టింగ్ దందాను హైదారాబాద్ పోలీసులు చేధించారు. ఈ ముఠాను అరెస్టు చేసి విచారించ‌గా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. క్రికెట్ బెట్టింగ్ లు చేస్తున్న అశోక్‌రెడ్డి అనే వ్య‌క్తి ఏకంగా 100 కోట్ల రూపాయ‌ల‌ను పోగొట్టుకున్నాడు. ఆయ‌న అడ్డ‌దారిలో డ‌బ్బు సంపాదించాల‌నే వారితో క‌లిసి ముఠాగా ఏర్ప‌డ్డారు. దాదాపు 12 ఏండ్ల కింద‌ట ఈ బెట్టింగ్‌లోకి అడుగుపెట్టాడు. క్రికెట్, హార్స్‌రైడింగ్ స‌హా అనేక క్రీడలపై బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నాడు. అయితే, ఇదే వ్య‌స‌నంగా మారి గ‌త 12 ఏండ్ల‌లో 100 కోట్లు కోల్పోయాడు. ఇటీవల ఐపీఎల్‌–2023 సీజ‌న్ లోనూ బెట్టింగ్‌కు తెర‌లేపిన ఆయ‌న్ను శుక్రవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. విచార‌ణ‌లో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ బెట్టింగ్ ముఠాలో ఉన్న ముగ్గురిని అరెస్టు చేసిన ఎల్బీనగర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ మురళీధర్, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్‌ చౌహాన్ లు మీడియాకు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. 

బెట్టింగ్ క‌థ సాగింది ఇలా.. ! 

అశోక్‌ రెడ్డి రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీలో ఉంటున్న ఆయ‌న ఈజీ మనీకోసం బెట్టింగ్‌లోకి ప్రవేశించాడు. ఈ క్ర‌మంలోనే బండ్లగూడలో నివాస‌ముంటున్న ఏడుకుళ్ల జగదీష్ (స్వ‌స్థ‌లం  మిర్యాలగూడ)  తో అతనికి పరిచయం ఏర్పడింది. ఇరువురు కలిసి ఈజీ మ‌నీ కోసం బెట్టింగ్  నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యంతో త‌న‌కు ఇదివ‌ర‌కు ప‌రిచ‌య‌మున్న ప్ర‌ధాన‌ బుకీలైన ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావు, సురేష్‌ మైలబాతుల అలియాస్‌ శివ, హ‌ర్యానా చెందిన విపుల్‌ మోంగాలను జగదీష్ కు అశోక్‌ రెడ్డి పరిచయం చేశాడు. ముందుగానే బెట్టింగ్ ప్లాన్ చేసుకుని  కూకట్‌పల్లిలో ఉంటున్న‌ ఐటీ ఉద్యోగి వొడుపు చరణ్‌ను కలెక్షన్‌ ఏజెంట్‌గా నియమించుకున్నారు.

ఐపీఎల్ 2023 సీజ‌న్ లో భాగంగా హైదరాబాద్-కోల్‌కతాల‌ మ్యాచ్ క్ర‌మంలో బెట్టింగ్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే నగదు వసూలు చేసేందుకు వెళ్తుండ‌గా, పోలీసులు శుక్రవారం వాసవికాలనీ రోడ్‌నంబర్‌–9లోని బసంతి బొటిక్‌ వద్ద అశోక్, జగదీష్, చరణ్‌లను పట్టుకున్నారు. మ‌రో ముగ్గురు ప‌రారీలో ఉన్నారు. నిందితులకు చెందిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ ఖాతాలలోని  రూ.3 కోట్ల లావాదేవీలను సీజ్ తో పాటు ఒక‌ కారు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. వీరు ‘నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌9’ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios