తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పొత్తులపై నిర్ణయం కేంద్ర కమిటీకి అప్పగింత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది సీపీఐ. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ భేటీ అయ్యింది. అయితే కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో.. తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ కమిటీ తీర్మానం చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది సీపీఐ. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ భేటీ అయ్యింది. అయితే కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో.. తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ కమిటీ తీర్మానం చేసింది. అనంతరం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. పాత ప్రతిపాదనలనే కాంగ్రెస్ ముందు పెట్టామన్నారు. పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర కమిటీకి తీర్మానం పంపామని.. త్వరలోనే కీలక ప్రకటన చేస్తామని సాంబశివరావు వెల్లడించారు.
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌తో పొత్తు కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే హస్తం నిర్ణయం కోసం నిరీక్షించిన కామ్రేడ్లు డెడ్‌లైన్ పెట్టారు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను 24 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. 17 నియోజకవర్గాలకు అభ్యర్ధులను కూడా ఆయన వెల్లడించారు.
ALso Read: కాంగ్రెస్‌తో పొత్తుకు రాంరాం: 17 స్థానాల్లో పోటీ చేస్తామన్న తమ్మినేని
భద్రాచలం, అశ్వారావుపేటతో పాటు ఖమ్మంలో 5, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 సీట్లలో పోటీ చేస్తామని వీరభద్రం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైరా, భద్రాచలం, పాలేరు తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరామని.. అయితే వైరా, మిర్యాలగూడ ఇస్తామని ఆ పార్టీ చెప్పిందని.. తర్వాత వైరా కూడా ఇచ్చేది లేదని చెప్పిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నో మెట్లు దిగి వచ్చినా .. కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదని ఆయన ఫైర్ అయ్యారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ విలువ ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు.