మునుగోడు ఉప ఎన్నిక తర్వాత లెక్క మారింది: కేసీఆర్‌పై కూనంనేని

తమకు బలం లేని చోట ఏం చేయాలనే దానిపై  ఆలోచిస్తున్నామని  సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  చెప్పారు. 
 

CPI Telangana Secretary Kunamneni Sambasiva Rao Responds  On  BRS Candidates list lns

హైదరాబాద్: బలం ఉన్న చోట కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేస్తాయని సీపీఐ  రాష్ట్ర సమితి కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  చెప్పారు.తమకు బలం లేని చోట ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్న  115 మంది అభ్యర్థులతో జాబితాను  ప్రకటించారు.ఈ విషయమై  సీపీఐ రాష్ట్ర సమితి  సమావేశమైంది.  ఈ విషయమై  చర్చిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏం చేయాలనే దానిపై  పార్టీ చర్చిస్తుంది.

మంగళవారంనాడు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకుంది. దానిపై ఏం చేయాలనే దానిపై  చర్చిస్తున్నట్టుగా  చెప్పారు. లెఫ్ట్ పార్టీలకు బలం లేని  చోట ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తామన్నారు. తమకు బలం లేని స్థానాల్లో  ప్రజాతంత్ర శక్తులను గెలిపించాలని కోరుతామని తెలిపారు. అయితే  ప్రజాంతత్ర శక్తులు ఎవరనే విషయమై చర్చిస్తున్నామన్నారు.

ఏ పార్టీలతో పొత్తు లేకుండా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని  కూడ  ఆయన చెప్పారు.  బీజేపీకి వ్యతిరేకంగా  మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్టుగా  కూనంనేని సాంబశివరావు  చెప్పారు.

also read:Telangana assembly elections 2023: కేసీఆర్ పై తమ్మినేని వీరభద్రం గుస్సా, కాంగ్రెస్ వైపు చూపు

ఆనాడు  తమ మద్దతును కేసీఆర్ కోరారన్నారు. మునుగోడులో బీఆర్ఎస్ కు మద్దతిచ్చి తప్పు చేసినట్టుగా భావించడం లేదని ఆయన చెప్పారు. రాజకీయాల్లో  మోసపోయే వారున్నంత కాలం మోసం చేసేవారుంటారన్నారు. అయితే  మోసం చేసిన వారెవరు, మోసపోయిన వారెవరు అనే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ లెక్క ఎందుకు మారిందో  తెలియాల్సి అవసరం ఉందన్నారు.ఈ విషయమై  కేసీఆర్ ను అడగాలని ఆయన మీడియాను కోరారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios