బిగ్ బాస్ రియాలిటీ షో పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. 100 రోజుల పాటు అంత మందిని ఒక ఇంట్లో బంధించి సమాజానికి ఎలాంటి సందేశమివ్వాలని భావిస్తున్నారని ప్రశ్నించారు.
రియాలిటీ షో అయిన బిగ్ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మళ్లీ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ షోలో పాల్గొనే వారిపై విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ షో ను ‘బూతుల స్వర్గం’ అంటూ పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ సిగ్గు, యెగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవు. తాజాగా వింత జంతువులు, భార్యా, భర్త భర్త కానొళ్ళు , అన్న చెల్లెలు కానోళ్ళు ముక్కు ముఖం తెలియని పిటపిటలాడే అందగాళ్ళు.. అచ్చోసిన ఆంబొతుల్లా అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజుల పాటు బూతల (బూతుల) స్వర్గంలో అమూల్య కాలాన్ని వృథా చేసే మహత్తర BIGBOSS వస్తున్నది. ’’ అని ఆయన పేర్కొన్నారు.
నేడు నిజామాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్.. తెలంగాణ యూనివర్సీటీ విద్యార్థి నేతల అరెస్ట్..
శక్తి యుక్తులు ఉన్న యువత సమాజం కోసం కృషి చేస్తూ.. సామాజిక న్యాయం కోసమో లేక సంపద ఉత్పత్తి కి ఉపయోగ పడకుండా వంద రోజుల అమూల్య కాలాన్ని వృథా చేస్తారా ? బూతుల స్వర్గం ఉత్పత్తి చేస్తారా అంటూ నారాయణ ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని సిగ్గులేని ప్రేక్షకులు టీవీల ముందు విరగబడి చూస్తూ జాతీయ సంపదను వృథా చేస్తారా అని అన్నారు.
సరదా కోసం డేటింగ్ యాప్ లింక్ నొక్కాడు.. న్యూడ్ చాట్ చేశాడు.. రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు...
‘‘ప్రేక్షకులు అడగాలి మాకేమి సందేశమిస్తున్నారని? ఏమిస్తారు ? మాలాగా మొగుళ్ళు పెళ్ళాల్ని వదిలేశి, పెళ్ళాలు మొగుడ్ని వదిలేశి అచ్చోసిన ఆంబొతుల్లాగా జీవించండని సందేశమిస్తారేమో ? గుడ్లప్పగించి చూడండి. కాసులకు కక్కుర్తి పడే లజ్జారహితులున్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నఅంత కాలం, ద్రౌపది వస్త్రాబరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాకరంగా దిగమింగుదామా ? శ్రీ శ్రీ చెప్పినట్టు పదండి ముందుకు, పదండి ముందుకని ఉరుకుదమా ? ’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ నారాయణ బిగ్ బాస్ షోపై కామెంట్స్ చేశారు.
