హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పుడు అన్ని పార్టీలు సీపీఐ జపం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్‌కు మద్ధతు ఇవ్వడంపై ఆ పార్టీ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు.

టీఆర్ఎస్‌తో కలిసి పనిచేసే అంశాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని నారాయణ వెల్లడించారు.

అలాగే పార్టీ అన్నాకా భిన్నాభిప్రాయాలు సహజమని ఎవరైనా సరే అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని నారాయణ పేర్కొన్నారు.

మరోవైపు హుజూర్‌నగర్‌లో ఏ పార్టీకి మద్ధతు తెలపాలన్న దానిపై హైదరాబాద్‌లోని ముఖ్దూం భవనంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఉపఎన్నికల్లో ఎవరికి మద్థతు ఇవ్వాలనే దానిపై నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికే వదిలిపెట్టాలని రాష్ట్ర అధినాయత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే మద్ధతు విషయంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: మద్దతివ్వాలని కోదండరామ్‌ను కోరిన కాంగ్రెస్

హుజూర్ నగర్ లో టీడీపి పోటీ: చంద్రబాబు వ్యూహం ఇదీ

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పోటాపోటీ: ఉనికి కోసం బీజేపీ, టీడీపీ

ఉత్తమ్ మరో సవాల్: అప్పుడు గెడ్డం తీయనని, ఇప్పుడు ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ ఛాలెంజ్...