హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలోని కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలోని కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని దంపతులు సతీశ్, వేద, పిల్లలు, నిషికేత్, నిహాల్‌లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్యం కారణంగా సతీశ్, వేద దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు కూడా సైనెడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక, సతీశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

