దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే జనం ఆసుపత్రులకు పరిగెడుతున్నారు.

తాజాగా హైదరాబాద్ మైండ్ స్పేస్‌లోని ఓ కంపెనీలో పనిచేసే టెక్కీలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీని భయంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లంతా గాంధీ ఆసుపత్రికి క్యూకట్టారు. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌లో కరోనా లక్షణాలు బయటపడటంతో మైండ్ స్పేస్‌ను మూసివేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Aslo Read:కరోనా ఎఫెక్ట్: డ్రంక్ అండ్ డ్రైవ్ నిలిపివేత? వాస్తవం ఇది!

అటు కరోనా సోకిన డీఎస్ఎం సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో పాటు పనిచేసే సహోద్యోగుల్లోనూ ఆందోళన నెలకొంది. దీంతో వారంతా లక్షణాలు ఉన్నా లేకపోయినా టెస్టుల కోసం గాంధీకి క్యూకడుతున్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 16 మంది ఇటాలీయన్లే.. వీరంతా భారతదేశ పర్యటన కోసం వచ్చారు. కాగా ఆగ్రాలో 6, కేరళలో 3, ఢిల్లీ, తెలంగాణల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. 

Also Read:కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన మాస్క్‌ల ధరలు

కరోనా కారణంగా హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 15న సీఏఏ గురించి వివరించేందుకు తలపెట్టిన బహిరంగసభను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అటు కరోనా  వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లో గాంధీకి ప్రత్యామ్నాయంగా మరో ఆసుపత్రిని పెట్టాలని సర్కార్ భావిస్తోంది. అనంతగిరితో పాటు మరో రెండు ప్రాంతాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.