కరోనా వైరస్... ఈ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఈ బూచిని చూపెట్టి ఏది చెప్పినా ప్రజలు నమ్మేలా ఉన్నారు. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. దీన్ని స్వయంగా హైదరాబాద్ నగర కమీషనర్ అంజనీ కుమార్ ఖండించాల్సి వచ్చింది. 

విషయం ఏమిటంటే... కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిలిపివేస్తూ పోలీసు శాఖ ఒక నిర్ణయం తీసుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో నేరుగా నగర కమీషనర్ అంజనీ కుమార్ స్పందిస్తూ... ఆ వార్తలు ఫేక్ న్యూస్ అని ఖండించారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగులు యథావిధిగా జరుగుతాయని ఆయన అన్నారు. పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరికీ వేరే స్ట్రా ని వాడుతున్నామని, దానితోపాటు అన్ని రక్షణ చర్యలను కూడా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. 

ఇకపోతే... కరోనా నేపథ్యంలోనే బెంగళూరులో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపివేశారు. ఇదే తరహాలో హైదరాబాద్ పోలీసులు కూడా నిర్ణయం తీసుకున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలా కమీషనర్ అంజనీ కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

కేవలం ఈ కరోనా వైరస్ కారణంగానే.... ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిలిపేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెప్పారు. సాధారణంగా వాహనదారుల నోట్లో గొట్టం పెట్టి గాలిని ఊది ఆల్కోమీటర్ ద్వారా మద్యం తాగిందీ లేనిదీ పరిశీలిస్తారు. అయితే... ప్రస్తుతం కరోనా భయం ఉంది కాబట్టి.. ఎవరైనా ఒక్కరికి ఆ వైరస్ఉన్నా..  ఇలా చేయడం వల్ల మిగిలిన వాళ్లకు కూడా సోకే ప్రమాదం ఉంది. 

దీంతో ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆల్కోమీటర్‌ వాడకుండా వైద్య పరీక్షలు నిర్వహించి జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు సూచించారు.  

 హైద్రాబాద్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఓ కంపెనీలో పనిచేస్తున్న టెక్కీకి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానాలు రావడంతో  ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని  ఆదేశాలు జారీ చేశారు.

Also read:45 మందికి నెగిటివ్ రిపోర్ట్: ఇద్దరి శాంపిల్స్ మరోసారి పూణెకు

 హైద్రాబాద్ రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్‌ నెంబర్ 20 లో  9వ, ఫ్లోర్‌లో డీఎస్‌ఎం కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని  మెయిల్ పంపింది. మరో వైపు మైండ్ స్పేస్  బిల్డింగ్‌లో ఉన్న  ఓపెన్ టెక్ట్స్,  సంస్థ కూడ ఉద్యోగులను కూడ వర్క్ ఫ్రం హోం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు కూడ  రహేజా మైండ్ స్పేస్ భవనంలో ఉన్నాయి.