Coronavirus: ఫిబ్రవరి 15కు ముందే తెలంగాణలో ఓమిక్రాన్ పీక్ స్టేజ్.. ఏం జరుగుతుందంటే?
Coronavirus: రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా గరిష్టంగా కరోనా కొత్త కేసులు నమోదవుతాయని ప్రఖ్యాత సూత్ర కన్సార్టియం-గణిత శాస్త్రవేత్తల తాజా విశ్లేషణ పేర్కొంది. తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఫిబ్రవరిలో గరిష్టంగా ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 15 నాటికి కరోనా వైరస్ ఒమిక్రాన్ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ ను దాటుతుందని కూడా వెల్లడించింది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో గత నవంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి ప్రభావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. కోవిడ్-19 థర్డ్ వేవ్ అంచనాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి సాధారణ కేసులతో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. రోజువారీ (Coronavirus) మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఫిబ్రవరిలోనే కరోనా వైరస్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ పీక్ స్టేజ్ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే నెల 15 నాటికి ఒమిక్రాన్ పీక్ స్టేజ్ దాటుతుందని చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా గరిష్టంగా కరోనా కొత్త కేసులు నమోదవుతాయని ప్రఖ్యాత సూత్ర కన్సార్టియం-గణిత శాస్త్రవేత్తల (SUTRA consortium) తాజా విశ్లేషణ పేర్కొంది. తెలంగాణ (Telangana)తో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఫిబ్రవరిలో గరిష్టంగా ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 15 నాటికి కరోనా వైరస్ ఒమిక్రాన్ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ ను దాటుతుందని కూడా వెల్లడించింది. కరోనా కేసుల పెరుగుదల ఆగిపోయే ముందు వారం లేదా 10 రోజుల పాటు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతాయని సూత్ర కన్సార్టియం-గణిత శాస్త్రవేత్తల విశ్లేషణ పేర్కొంది. కరోనా వైరస్ డెల్టా సెకండ్ వేవ్‌తో పోల్చినప్పుడు మూడవ వేవ్ సమయంలో ఆస్పత్రిలో చేరికలు చాలా తక్కువగా ఉంటాయనీ, ప్రజలు థర్డ్ వేవ్ పై భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని SUTRA కన్సార్టియం పరిశోధకులు చెబుతున్నారు.
“డెల్టాతో పోల్చినప్పుడు ఓమిక్రాన్ విజృంభణ కొనసాగే కోవిడ్-19 (Coronavirus) థర్డ్ వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగా ఉంటాయి. కాబట్టి భయపడవద్దని మేము రాష్ట్ర ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలకు నిరంతరం సలహా ఇస్తున్నాము. తెలంగాణ (Telangana) లో రోజువారీ కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఎప్పుడైనా గరిష్ట స్థాయికి చేరుకుంటాయనీ, ఇది గరిష్టంగా ఒక వారం లేదా 10 రోజులు కొనసాగవచ్చని సూచనలు ఉన్నాయి. ఫిబ్రవరి 15 నాటికి, తెలంగాణ సహా అనేక ఇతర భారతీయ రాష్ట్రాల్లో తాము కరోనా థర్డ్ వేవ్ ను పీక్ స్టేజ్ ను అధిగమిస్తాం" అని సూత్ర కన్సార్టియంలో భాగమైన ఐఐటి-హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం విద్యాసాగర్ తెలిపారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముగిసే ఖచ్చితమైన రోజును పిన్-పాయింట్ లేదా ప్రొజెక్ట్ చేయడం సాధ్యం కానప్పటికీ, ప్రస్తుతం అందుతున్న సంకేతాలు, కొనసాగుతున్న కోవిడ్పో-19 పోకడలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
“ఫిబ్రవరి 15 నాటికి, తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్-19 (Coronavirus) మూడవ వేవ్ గరిష్ట స్థాయిని దాటుతుందనీ, ప్రస్తుత ట్రెండ్ ఫిబ్రవరి చివరి నాటికి, మూడవ కోవిడ్ తరంగం చివరి దశకు చేరుకుందని గణాంకాలు పేర్కొంటున్నాయి. మొదటి నుంచి మూడవ వేవ్ తీవ్రంగా ఉండదనీ, ఆస్పత్రిలో చేరికలు తక్కువగా ఉంటాయని స్థిరంగా కొనసాగుతున్న గణాంకాలు చెబుతున్నాయి ”అని డాక్టర్ విద్యాసాగర్ చెప్పారు. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ల తగ్గుదలకు స్పష్టమైన సంకేతం వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను పునఃప్రారంభించే ప్రణాళికను ప్రారంభించవచ్చని ఆయన సూచించారు. ''ప్రభుత్వ పాఠశాలలను మూసి ఉంచడం వల్ల ప్రయోజనం లేదు. తల్లిదండ్రులు సుముఖంగా ఉంటే తమ పిల్లలను బడికి పంపనివ్వండి. అయితే, అంటువ్యాధులు తగ్గడం ప్రారంభించిన తర్వాత పాఠశాలలను తెరవడాన్ని ప్రభుత్వాలు పరిగణించాలి”అని ఆయన అన్నారు.