Asianet News TeluguAsianet News Telugu

మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం: ఖాళీ అయిన ఆఫీసులు

హైద్రాబాద్ లో కరోనా కలకలం రేపుతోంది. మైండ్ స్పేస్ లో రెండు ప్రముఖ సంస్థలు ఇంటి నుండే పనిచేయాలని ఉద్యోగులకు అవకాశాలు కల్పించాయి. 

Corona virus in Hyderabad: TWo companies given work from home chance to their employees
Author
Hyderabad, First Published Mar 4, 2020, 1:38 PM IST


హైదరాబాద్: కరోనా వైరస్ హైద్రాబాద్‌ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.  హైద్రాబాద్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుండే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఓ కంపెనీలో పనిచేస్తున్న టెక్కీకి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానాలు రావడంతో  ఈ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని  ఆదేశాలు జారీ చేశారు.

Also read:45 మందికి నెగిటివ్ రిపోర్ట్: ఇద్దరి శాంపిల్స్ మరోసారి పూణెకు

 హైద్రాబాద్ రహేజా మైండ్ స్పేస్ బిల్డింగ్‌ నెంబర్ 20 లో  9వ, ఫ్లోర్‌లో డీఎస్‌ఎం కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని  మెయిల్ పంపింది. మరో వైపు మైండ్ స్పేస్  బిల్డింగ్‌లో ఉన్న  ఓపెన్ టెక్ట్స్,  సంస్థ కూడ ఉద్యోగులను కూడ వర్క్ ఫ్రం హోం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు కూడ  రహేజా మైండ్ స్పేస్ భవనంలో ఉన్నాయి.

Also read:సికింద్రాబాద్‌లో టెక్కీకి కరోనా: స్కూళ్లకు సెలవులు

సుమారు వెయ్యికి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఓ టెక్కీ ఇటలీ నుండి హైద్రాబాద్ కు వచ్చింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనుమానాలు  వ్యక్తమయ్యాయి. అయితే ఇంకా నిర్ధారణ కాలేదు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ రెండు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుండి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇవాళ ఉదయం విధులకు వచ్చిన ఉద్యోగులను కూడ ఆయా సంస్థలు ఇంటికి పంపించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios