హైదరాబాద్: సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌కు చెందిన టెక్కీకి కరోనా పాజిటివ్ రావడంతో ఈ ప్రాంతంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  ఈ ప్రాంతవాసులు బయటకు రావాలంటే భయపడుతున్నారు.

Also read::   కరోనా వైరస్ సోకిన టెక్కీ ఇల్లు ఇక్కడే: భయం గుప్పిట్లో సికింద్రాబాద్ కాలనీ

దుబాయ్‌ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన టెక్కీకి కరోనా వ్యాది సోకింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఆయన పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా టెక్కీ దుబాయ్‌కు వెళ్లాడు. దుబాయ్‌లోనే ఆయనకు కరోనా వ్యాధి సోకిందని వైద్యులు గుర్తించారు. 

Also read:కోనసీమలో కరోనా కలకలం: టెక్కీకి వ్యాధి లక్షణాలు?

కర్ణాటక మీదుగా ఆయన సికింద్రాబాద్‌కు చేరుకొన్నారు.వ్యాధి లక్షణాలు నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. టెక్కీకి కరోనా వ్యాధి సోకిందని తెలిసిన తర్వాత మహేంద్ర హిల్స్ ప్రాంతానికి చెందిన వారంతా భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారంతా బయటకు అడుగుపెడుతున్నారు. ముఖానికి మాస్క్‌లు లేకుండా అడుగు పెట్టడం లేదు.  మహేంద్ర హిల్స్‌లో ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.  ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన దుబాయ్ నుండి టెక్కీ బెంగుళూరుకు తిరిగి వచ్చాడు. బెంగుళూరు నుండి  ఫిబ్రవరి 22న మహేంద్ర హిల్స్‌కు చేరుకొన్నాడు.

ఐదు రోజుల పాటు ఈ ప్రాంతంలోనే తిరిగాడు. కరోనా వైరస్ సోకిన  టెక్కీ ఎవరెవరిని కలిశారనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంలో పారిశుద్యాన్ని మెరుగుపర్చేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.  

మహేంద్ర హిల్స్ ప్రాంతంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉంటారు. ధనికులు ఎక్కువగా నివాసం ఉండే ఈ ప్రాంతంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి సంచరించడంతో ముందు జాగ్రత్తగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.మహేంద్ర హిల్స్ ప్రాంతంలోనే కాకుండా అడ్డగుట్టలో కూడ ఓ స్కూల్ కు వచ్చిన విద్యార్థులను టీచర్లు  వెనక్కి పంపారు.