హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బుధవారం మైండ్‌స్పేస్‌లోని 20వ నెంబర్ భవనంలో కరోనా లక్షణాలు బయటపడిన ఉద్యోగినికి నెగిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Also Read:కరోనాతో ఐటీ కంపెనీల్లో వర్క్‌ఫ్రం హోం హడావిడి: ఈటల సంచలన వ్యాఖ్యలు

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో రెండు కరోనా అనుమానిత కేసులకు నెగిటివ్ వచ్చిందన్నారు. మైండ్ స్పేస్ ఉద్యోగినితో పాటు అపోలో ఆసుపత్రిలో శానిటేషన్ మహిళకు కూడా కరోనా నెగిటివ్ అని తేలిందన్నారు.

అలాగే గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కూడా కోలుకుంటున్నాడని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదయ్యిందని, ఒక రకంగా రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులని ఆయన అన్నారు.

Also Read:కరోనా వైరస్ రోగులకు ప్రత్యేక ఆస్పత్రి: అనంతగిరిలోనే ఎందుకు?

తెలంగాణలో ఇక కరోనా రాకూడదని కోరుకుంటున్నానని, కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం అభినందించిందని, భారతదేశంలో కరోనా ప్రభావం లేదని ఈటల రాజేందర్ చెప్పారు.