మహబూబ్ నగర్: సీరియల్ కిల్లర్ ఎరుకలి శ్రీను పోలీసులు సీజ్ చేసినప్పటికీ అదే బైక్ ను ఎలా తిరిగి పొందుతున్నాడనే విషయంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎరుకలి శ్రీను ఇటీవల నాలుగు హత్యలు చేసిన చేసినట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. నేరాలు చేయడానికి ఇన్నాళ్లుగా అదే బైక్ ను శ్రీను ఎలా వాడగలుగుతున్నాడనే విషయం పోలీసులు అంతు చిక్కడం లేదు.

ఎకురలి శ్రీనుపై 18 కేసులున్నాయి. వీటిలో 17 కేసులు హత్యలకు సంబంధించినవే. 2007 నుంచి ఇప్పటి వరకు అతను 17 మంది మహిళలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై మహబూబ్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు. దీనివల్ల అతనికి ఏడాది వరకు బెయిల్ రాదు.

Also Read: సైకో కిల్లర్ శ్రీనివాస్‌:సంచలన విషయాలు, ఐపీఎస్‌ల నెంబర్లు

2014, 2015 సంవత్సరాల్లో అరెస్టు చేసినప్పుడు తన బైక్ ను అతను కోర్టు ద్వారా తిరిగి పొందాడు. ప్రతి సారీ తన బైక్ ను అతను ఎలా పొందగలుగుతున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళలను మాయమాటలతో నమ్మించి, తన బైక్ పై ఎక్కించుకుని, వారిని హత్య చేసి, వారిపై ఉన్న నగలను దొంగలిస్తూ వస్తున్నాడు. 

పోలీసులు సీజ్ చేసిన ఆస్తులను ఇంటరీమ్ కస్టడీ ద్వారా కొన్ని షరతులతో నిందితులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. శ్రీను దేవరకద్ర, బూత్ పూర్, కొత్తకోట, మిడ్జిల్ ల్లో నాలుగు హత్యలు చేసినప్పుడు అదే బైక్ వాడాడు. శ్రీను కల్లు దుకాణాల వద్ద మాటు వేసి మహిళలను పరిచయం చేసుకుని వారిని నమ్మించి వారికి మద్యం తాగించి, బైక్ ఎక్కించుకుని వెళ్లి, హత్యలు చేసి నగలను దొచుకుపోతున్నాడు.  

Also Read: సీరియల్ కిల్లర్: మత్తులోకి దించి 16 మంది మహిళలను చంపాడు