మహాబూబ్‌నగర్: సైకో కిల్లర్ శ్రీనివాస్  కేసులో సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సైకో కిల్లర్‌ను అరెస్ట్ చేసిన సమయంలో శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఓ ఐపీఎస్ ఫోన్ చేశారు.  సైకో కిల్లర్ శ్రీనివాస్‌ను మరోసారి పోలీసులు విచారించే అవకాశం ఉంది.

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తున్న నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.  సైకో కిల్లర్ శ్రీనివాస్‌ను  విచారించిన పోలీసులు షాకయ్యారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని శ్రీనివాస్  హత్యలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

సైకో కిల్లర్ శ్రీనివాస్ సెల్‌ఫోన్‌‌లో పలువురు ఐపీఎష్ అధికారుల ఫోన్‌ నెంబర్లు ఉన్నట్టుగా మహాబూబ్‌నగర్ పోలీసులు గుర్తించారు. సైకో కిల్లర్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సమయంలో ఓ ఐపీఎస్ అధికారి మహాబూబ్‌నగర్ పోలీసులకు ఫోన్ చేసి శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించినట్టుగా తెలిసింది.

శ్రీనివాస్ సెల్‌పోన్‌లో ఐపీఎస్ అధికారుల పోన్ నెంబర్లు ఉండడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు సైకో శ్రీనివాస్‌ను విచారించాలని భావిస్తున్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌నెు మరోసారి విచారణ చేసేందుకు కస్టడీకి తీసుకోనున్నారు.