కానిస్టేబుల్ కు గాయాలు ఢీకొన్న ఇంద్రకరణ్ రెడ్డి కారు

సిఎం కేసిఆర్ జెపి దర్గా లో ఇవాళ మొక్కులు తీర్చుకున్నారు.

తెలంగాణ వస్తే దర్గాకు వచ్చి మొక్కు చెల్లిస్తానని కేసిఆర్ మహబూబ్ నగర్ ఎంపిగా ఉన్న సమయంలో మొక్కుకున్నారు.

దీంతో ఆ మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఇవాళ టిఆర్ఎస్ యంత్రాంగమంతా అక్కడ దిగిపోయారు.

పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి జెపి దర్గాకు పోయిర్రు సిఎం కేసిఆర్.

ఈ సందర్భంగా కాన్వాయ్ లోని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనం ఢీకొనడంతో ఒక కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.

ఈ సంఘటనలో గాయపడిన కానిస్టేబుల్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.

గాయపడిన కానిస్టేబుల్ రవికిరణ్ గా చెబుతున్నారు.

ఆయన కీసర పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించేవాడని చెబుతున్నారు. 

ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు.

మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్వాగత్ హోటల్ లో పురుగల చికెన్

ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్
https://goo.gl/Tsck2C