Asianet News TeluguAsianet News Telugu

దొంగల ముఠాలతో చోరీలు చేయిస్తున్న కానిస్టేబుల్.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

దొంగలతో చోరీలు చేయిస్తున్న ఓ కానిస్టేబుల్ ను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు దొంగలను ముఠాలుగా ఏర్పాటు చేసి వారికి నెల నెల జీతాలు ఇస్తున్నట్టు పోలీసు విచారణ తేలింది. 

Constable doing thefts with gangs of thieves.. Things that will come to light..
Author
First Published Nov 28, 2022, 12:48 PM IST

ఆయన ఓ పోలీసు కానిస్టేబుల్. చాలా కాలం నుంచి ఉద్యోగంలో కొనసాగడంతో నేరస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. దొంగలతో స్నేహం ఏర్పాటు చేసుకున్నాడు. వారిని కొన్ని ముఠాలుగా ఏర్పాటు చేశాడు. వారికి నెల నెలకు జీతాలు ఇచ్చేవాడు. వారితో చోరీలు చేయించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు. కానీ ఒక రోజు పోలీసు ఉన్నతాధికారులకు విషయం తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఇటీవల దొంగతనం ఘటనలు పెరిగిపోయాయి. దీంతో పట్టణ పోలీసులు దీనిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తే ఈ చోరీలన్నీ ఓ కానిస్టేబుల్ ఈశ్వర్‌ చేయిస్తున్నాడని చెప్పారు. దీంతో పోలీసులు కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు విచారించారు.

సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

అయితే నిందితుడు ఈశ్వర్ మొదట ఏ విషయాలు చెప్పకపోయినా.. దొంగలకు ఆశ్రయం కల్పించినట్టు పోలీసులు ఆధారాలు చూపించారు. దీంతో అతడు పలు విషయాలు వెల్లడించాడని ‘ఈనాడు’ పేర్కొంది. ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన చాలా కాలంగా కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. క్రైమ్ బ్రాంచ్ లో పని చేయడంతో నేరస్తులు, దొంగలతో పరిచయాలు అయ్యాయి. 

ఇన్ ఫార్మర్ల సాయంతో అంతర్రాష్ట్ర గ్యాంగ్ ల ఆచూకీని తెలుసుకునేవాడు. వారి వద్ద నుంచి రికవరీ చేసిన సొత్తులో చేతివాటం చూపించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అందులో నుంచి ఇన్ స్పెక్టర్ లకు, సబ్ ఇన్ స్పెక్టర్లకు కొంత భాగం అందించేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దొంగలతో స్నేహాన్ని చేసుకున్నాడు. 

భైంసాలో భారీగా పోలీసులు మోహరింపు.. కరీంనగర్‌లోనే బండి సంజయ్.. పాదయాత్రపై సందిగ్దత

నేరస్తుల ఫ్యామిలీలోని పిల్లలు, లేడీస్ తో గ్యాంగ్ లను రూపొందించాడు. వారికి హఫీజ్‌పేట్‌లోని తన ఇంట్లోనే ఆశ్రయం ఏర్పాటు చేశాడు. జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, కూరగాయాల మార్కెట్లు, సభలు, సమావేశాలు నిర్వహించే ప్రాంతాల్లో జేబు దొంగతలు, సెల్ ఫోన్లు, బంగారపు చైన్ లు చోరీ చేయించేవాడు. ఇలా దొంగతనం చేసే కుటుంబాలకు నెలలకు 40 నుంచి 50 వేల రూపాయిలను జీతంగా అందజేసేవాడు. మొత్తంగా నిందితుడు కానిస్టేబుల్ 7 గ్యాంగ్ లను మెయింటెన్ చేసేవాడు. వీరిందరితో భారీగా బంగారు నగలు, సెల్ ఫోన్లు దొంగతనం చేయించేవాడు. వాటిని అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు.

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు.. ఆ డబ్బులు చెల్లించాలని ఆదేశం..

కాగా.. ఈశ్వర్ వేధింపులు తట్టుకోలేక పలువురు పలువురు దొంగలు ఎవరికీ కనిపించకుండా తిరుగుతుండగా.. మరికొందరు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లి తలదాచుకుంటున్నారు. అయితే కానిస్టేబుల్ పోలీసుల అదుపులో ఉండటంతో పలువురు సర్కిల్ ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్ లకు టెన్షన్ మొదలు అయ్యింది. ఇప్పటికే నలుగురు సర్కిల్ ఇన్ స్పెక్టర్ లపై ఇంటర్నల్ ఎంక్వేరీ కొనసాగుతోంది. ఇందులో ప్రమేయం ఉన్న మరి కొందరు సిబ్బందిని కూడా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios