తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు.. ఆ డబ్బులు చెల్లించాలని ఆదేశం..
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ కేంద్రం నోటీసులను పంపింది.

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ కేంద్రం నోటీసులను పంపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఇజీఎస్) నిధులను కేంద్ర పథకం మార్గదర్శకాల ప్రకారం అనుమతించని పథకాలకు మళ్లించినందుకు రూ. 151.9 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపించింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు కేసీఆర్ సర్కార్ గ్రామీణాభివృద్ధి శాఖ నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించకపోతే.. తదుపరి వాయిదాలను నిలిపివేయనున్నట్టుగా తెలిపింది.
అయితే ఇప్పటికే తెలంగాణలోని కేసీఆర్ సర్కార్‌కు, కేంద్రంలోని మోదీ సర్కార్‌కు మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం ఈ విధమైన నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం మధ్య మరోసరి మాటల యుద్దం తెరదీసే అవకాశం ఉంది.