Asianet News TeluguAsianet News Telugu

సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమైన భారత్-ఆస్ట్రేలియా

భారత్-ఆస్ట్రేలియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇరుదేశాలు నేటీ నుంచి  ‘‘ఆస్ట్రా-హింద్ 2022’’ పేరిట సైనిక విన్యాసాలు ప్రారంభించనున్నారు. ఇవి వచ్చే నెల 11 వరకు కొనసాగుతాయి. ఈ ఇరుదేశాలకు చైనా నుంచిముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరుగుతుండడం గమనార్హం. 

India, Australia to conduct joint army exercise in Rajasthan from today
Author
First Published Nov 28, 2022, 12:22 PM IST

భారత్-ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు: భారత్, ఆస్ట్రేలియాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేయడానికి సిద్దమయ్యాయి. ‘‘ఆస్ట్రా-హింద్ 2022’’ పేరిట నేటీ నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాలు వచ్చే నెల 11 వరకు కొనసాగుతాయి. ఈ విన్యాసాలకు రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ వేదిక కానున్నది. ఈ విన్యాసాలు ఇరుదేశాల పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయని భారత్ భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆర్మీకి చెందిన 13వ బ్రిగేడ్ 2వ డివిజన్ ఆర్మీ ఇప్పటికే రాజస్థాన్ చేరుకుంది. భారత బృందంలో డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. 

ఈ సంయుక్త సైనిక విన్యాసాల వల్ల భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని, ఇరుదేశాల మధ్య అవగాహన,పరస్పర సహకారం అందించుకోవడానికి తోడ్పడుతాయని భారత ప్రతినిధి తెలిపారు. సాంకేతిక పద్ధతులు, విధానాలు  జాయింట్ ఎక్సర్సైజ్ ద్వారా ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు ఊపందుకున్నాయి. ఆస్ట్రేలియా పార్లమెంటు భారతదేశంతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ  ఒప్పందం ద్వారా వస్త్రాల నుండి ఫార్మాస్యూటికల్స్ వరకు, రత్నాల నుండి ఆభరణాల వరకు భారతీయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచుతుందని భావిస్తున్నారు. ఆర్మీ విన్యాసాలు కాకుండా, భారత్, ఆస్ట్రేలియాలు క్రమం తప్పకుండా సంయుక్తంగా వైమానిక, నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తుంది. అంతేకాకుండా  యుఎస్, జపాన్ లతో భారత్  నౌకాదళ విన్యాసానాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios