హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకొంటామని ధీమాతో ఆ పార్టీ ఉంది. ఈ నెల 12వ తేదీన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పీపుల్స్ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో  కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పీపుల్స్ ఫ్రంట్ 80 సీట్లను కైవసం చేసుకొంటుందని  ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఆదివారం నాడు కూటమి నేతలు సమావేశమయ్యారు. వీరంతా జిల్లాల వారీగా పోలింగ్ శాతంపై సమీక్ష నిర్వహించారు.

ఏ జిల్లాలో కూటమికి, టీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై ఆరా తీశారు. మెజారిటీకి అవసరమైన సీట్లు తక్కువైతే  ఏం చేయాలనే దానిపై కూడ  కాంగ్రెస్ నేతలు ముందస్తు వ్యూహలను రచిస్తున్నారు.

నలుగురు ఇండిపెండెంట్లతో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు చర్చిస్తున్నారు. డికె శివకుమార్‌, జలంధర్‌ రెడ్డి, రాములునాయక్‌‌లతో పాటు మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థితో  కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లారు.

పోలింగ్ సరళి ఆధారంగా సుమారు 80 సీట్లను కూటమి కైవసం చేసుకొంటుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. డిసెంబర్ 11వ, తేదీ సాయంత్రం సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  సీఎల్పీ నేతను ఎన్నుకొంటారు.

మరో వైపు ఎల్లుండి  కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

 

సంబంధిత వార్తలు

కూటమి ముందు జాగ్రత్త: గవర్నర్‌తో భేటీ మతలబు అదే

గవర్నర్‌తో ప్రజా కూటమి నేతల భేటీ

ఫలితాల ముందే హైటెన్షన్: కేసీఆర్‌తో అసద్ భేటీ, గవర్నర్‌తో కూటమి నేతలు