హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ప్రజా కూటమి నేతలు సోమవారం నాడు గవర్నర్ నరసింహాన్‌తో సమావేశమయ్యారు.

ఈ ఎన్నికల్లో  టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు ‌పీపుల్స్ ఫ్రంట్‌గా ఏర్పడి  పోటీ చేశాయి.  ఈ నాలుగు పార్టీలను ఒకే పార్టీగా గుర్తించాలని కూడ గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ నేతలు కోరనున్నారు. గతంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కూడ కూటమి నేతలు గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు.

ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై  కూడ ప్రజా కూటమి నేతలు ప్లాన్‌లో ఉన్నారు.  అవసరమైన మెజారిటీ కోసం ఇండిపెండెంట్ల మద్దతును, ఇతర పార్టీల మద్దతును కోరుతున్నారు.

ఎన్నికలకు ముందే  కూటమి ఏర్పడింది. కామన్ మినిమమ్  ప్రోగ్రాం ఆధారంగా  పోటీ చేసిన విషయాన్నికూడ నేతలు ప్రస్తావించనున్నారు.

సంబంధిత వార్తలు

ఫలితాల ముందే హైటెన్షన్: కేసీఆర్‌తో అసద్ భేటీ, గవర్నర్‌తో కూటమి నేతలు