Asianet News TeluguAsianet News Telugu

ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ : రాహుల్ కు క‌విత కౌంట‌ర్

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టేన‌నీ, ఈ రెండు పార్టీల వెంటే ఎంఐఎం నడుస్తోంద‌నీ, కేసీఆర్ ఓట‌మి ఖాయ‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత తీవ్రంగా ఖండించారు. 
 

Congress MP  Rahul Gandhi need not worry about Telangana people: BRS MLC Kalvakuntla Kavitha RMA
Author
First Published Oct 19, 2023, 10:42 PM IST

BRS MLC Kalvakuntla Kavitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్న ఆ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టేన‌నీ, ఈ రెండు పార్టీల వెంటే ఎంఐఎం నడుస్తోంద‌నీ, కేసీఆర్ ఓట‌మి ఖాయ‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల గురించి రాహుల్ గాంధీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారు మెరుగైన పాల‌న అందిస్తున్నద‌ని తెలిపారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందనీ, రాష్ట్రంపై పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని పేర్కొంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. "తెలంగాణ ప్రజల గురించి రాహుల్ గాంధీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్ అధినేత  ప్ర‌జ‌ల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని" ఆమె అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ "తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల్లో రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. స్క్రిప్ట్ రైటర్లు అతన్ని తప్పుదారి పట్టిస్తున్నారు...మన రాష్ట్రాన్ని మనమే ఎలా నడిపించాలో మాకు తెలుసు. తలసరి ఆదాయం, వరి ఉత్పత్తి, నీటిపారుదల ప్రాజెక్టులో దేశంలోనే మనదే నంబర్ వన్ రాష్ట్రం.." అంటూ రాహుల్ కు కౌంట‌రిచ్చారు. గురువారం నిజామాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్ర‌చార‌ ర్యాలీ సంద‌ర్భంగా క‌విత ఏఎన్ఐతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

కాగా, అంత‌కుముందు, తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. "ప్రజలు పరిపాలించే తెలంగాణ గురించి మీరు కలలు కన్నారు, కానీ గత పదేళ్లలో, మీ సీఎం కేసీఆర్ ప్రజలకు దూరమయ్యారు. ఆయ‌న కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తోంది, మీ కలను తుడిచిపెట్టింది. భారతదేశంలోనే తెలంగాణలో అత్యధిక అవినీతి ఉంది, ఇది తెలంగాణ యువత-మహిళలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోరుకుంటోందని కూడా ఆరోపించారు.

"బీజేపీ, ఎంఐఎంలు బీఆర్‌ఎస్ కు సహకరిస్తున్నాయి, ఈ పార్టీలన్నీ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బీజేపీ కేసులు వేస్తోందని, అయినా కేసీఆర్‌పై కేసులు లేవన్నారు. సీఎం కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ కేసులు లేకపోవడం అనేక‌ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇదే వారి మ‌ధ్య బంధానికి నిద‌ర్శ‌నమంటూ విమ‌ర్శించారు. కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెల్ల‌డిస్తామ‌ని భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే, 2018లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికలలో, BRS 119 స్థానాలకు గాను 88 స్థానాలను గెలుచుకోగలిగింది. 47.4 శాతం ఓట్ల వాటాను కలిగి ఉంది. కాంగ్రెస్ 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. దాని ఓట్ షేర్ 28.7 శాతంగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios