నల్గొండ: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.శుక్రవారం నాడు ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికార దుర్వినియోగం, కుల, మతాల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందాలని చూసిందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని ఆయన చెప్పారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమైనవేనని ఆయన చెప్పారు.  రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాటన వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్నట్టుగానే తెలంగాణలో కూడ కార్యకర్తలు పోరాటం చేయాలని ఆయన కోరారు.సన్నరకం వరి పండించాలని కోరిన సీఎం వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సిందిగా కోరారు.

also read:జీహెచ్ఎంసీ కౌంటింగ్: బోరబండ నుండి గెలుపొందిన డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్

ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. అనేక తప్పుడు వాగ్ధానాలతో టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.