హైదరాబాద్: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బోరబండ నుండి రెండోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే డివిజన్ నుండి ఆయన పోటీచేసి విజయం సాధించారు.గత ఎన్నికల్లో బోరబండ నుండి విజయం సాధించిన బాబా ఫసియుద్దీన్ ను డిప్యూటీ మేయర్ గా టీఆర్ఎస్ నియమించింది.

ఈ దఫా ఇదే స్థానం నుండి ఫసియుద్దీన్ పోటీ చేసి గెలుపొందారు. గతంతో పోలిస్తే ఆయన ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారని సమాచారం. గత పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ గా ఉన్న మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం నుండి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్ధిగా  ఆయన మెహిదీపట్నం నుండి పోటీ చేసి గెలుపొందారు.

also read:టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు అత్యధిక స్థానాల్లో అధిక్యంలో నిలిచారు. టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో ఎంఐఎం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నిలిచారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఆధిక్యాలను పరిశీలిస్తే రెండోసారి బల్దియా పీఠంపై టీఆర్ఎస్ తన జెండాను ఎగురవేయనుందనే స్పష్టమౌతోంది.