కారణమిదే: జానా, ఉత్తమ్‌‌పై కోమటిరెడ్డి అసంతృప్తి

Congress MLA Komatireddy Venkat Reddy demands to implement single bench  orders
Highlights

జానారెడ్డి, ఉత్తమ్‌కు కోమటిరెడ్డి షాక్

హైదరాబాద్:ప్రజలను మోసం చేసినట్టుగా న్యాయవ్యవస్థను తెలంగాణ సీఎం కెసిఆర్ ఎంతోకాలం మోసం చేయలేరని తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన  తీర్పు తేటతెల్లం చేసిందని  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. గతంలో ఇచ్చిన సింగిల్ జడ్జి తీర్పును రేపటిలోపుగా అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందు సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది.ఈ తీర్పుపై సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

హైకోర్టు డివిజన్ బెంచ్ 12 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్ కొట్టివేయడం పట్ల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షాన్ని వ్యక్తం చేశారు. 12 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  కోట్లాది రూపాయాలు సంపాదించుకొని తమపై పిటిషన్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు. 

ఈ కేసులో ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం మాత్రమే పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు అభిప్రాయపడిన విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను మోసంచేసినట్టుగానే  న్యాయవ్యవస్థను ఎంతోకాలం పాటు మోసం చేయలేరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పోర్టల్ లో ఇంకా తమను మాజీ ఎమ్మెల్యేలుగానే చూపుతున్నారని ఆయన చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పును  ఇంకా అమలు చేయలేదన్నారు. ఈ విషయమై కోర్టు ధిక్కరణ కేసును కూడ రెండు రోజుల్లో మరో పిటిషన్ ను దాఖలు చేయనున్నట్టు ఆయన చెప్పారు.


కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కోమటిరెడ్డి అసంతృప్తి

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని  తెలంగాణ సిఎల్పీ  నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు చొరవ తీసుకోవాలన్నారు. తమ సభ్యత్వాలను రద్దు చేసిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలు కూడ రాజీనామాలు చేయాలని గతంలో నిర్ణయించుకొన్న విషయాన్నిఆయన గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుభూతిగా ఉన్నారని చెప్పారు.

మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తే  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ కేసు విషయంలో పూర్తిగా సహకరించారని ఆయన చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం  మాత్రం ఆశించిన రీతిలో సహకరించలేదన్నారు.


 

loader