మాజీ మంత్రి డికె అరుణ భర్త డికె భరతసింహారెడ్డికి రోడ్డు ప్రమాదంలో గాయాలు. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద భరతసింహారెడ్డి ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న మరో కారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ భరత్. గాయపడిన భరత్ ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలింపు.

కాంగ్రెస్ గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ భర్త డికె భరతసింహారెడ్డికి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద భరతసింహారెడ్డి ప్రయాణిస్తున్న కారును మీరొక కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన భరత్ సింహారెడ్డిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఘటన తెలుసుకున్న డికె అరుణ హైదరాబాదు బయలు దేరారు.
