లాల్‌దర్వాజ బోనాలు: బంగారు బోనం సమర్పించిన విజయశాంతి

First Published 5, Aug 2018, 12:58 PM IST
congress leader Vijayashanthi offers gold bonam to goddess mahakali
Highlights

 లాల్‌దర్వాజ బోనాలను పురస్కరించుకొని  ఆదివారం నాడు  అమ్మవారికి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ  విజయశాంతి బంగారు బోనం సమర్పించారు.  
మహంకాళి అమ్మవారికి  విజయశాంతి ఆదివారం నాడు బంగారు బోనం సమర్పించారు. 


హైదరాబాద్: లాల్‌దర్వాజ బోనాలను పురస్కరించుకొని  ఆదివారం నాడు  అమ్మవారికి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ  విజయశాంతి బంగారు బోనం సమర్పించారు.  
మహంకాళి అమ్మవారికి  విజయశాంతి ఆదివారం నాడు బంగారు బోనం సమర్పించారు. 2014 ఎన్నికలకు ముందు  ఆమె  టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు.  అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే ఇటీవల కాలంలో  కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆమె  సన్నాహలు చేసుకొంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ కుంతియాతో ఆమె సమావేశయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసేందుకు కూడ ఆసక్తి చూపుతున్నారని సమాచారం.

అయితే ఈ తరుణంలో ఆదివారం నాడు  బోనాలను పురస్కరించుకొని మహంకాళి అమ్మవారికి  విజయశాంతి బంగారు బోనాన్ని సమర్పించారు.  గత ఆదివారం నాడు సికింద్రాబాద్ బోనాలను పురస్కరించుకొని  నిజామాబాద్ ఎంపీ కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో  విజయశాంతికి  ప్రత్యేక స్థానం కల్పిస్తామని కూడ ఆ పార్టీ  అధిష్టానం ఆమెకు హామీ ఇచ్చిందనే ప్రచారం కూడ లేకపోలేదు. 

ఈ వార్త చదవండి:సికింద్రాబాద్ బోనాలు: బంగారు బోనం సమర్పించిన కవిత (వీడియో)

 

loader