: 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ .. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకొందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు.
ఆలంపూర్: 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ .. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకొందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. టీడీపీతో ఆనాడు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం ఎలా సరైందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆలంపూర్ వచ్చిన సందర్భంగా ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గాను తాము టీడీపీతో పొత్తు పెట్టుకొన్నామని విజయశాంతి చెప్పారు. ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తోన్నట్టు కన్పిస్తోందా అని ఆమె ప్రశ్నించారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొన్న సమయంలో తెలంగాణకు టీడీపీ వ్యతిరేకంగా ఉన్న విషయం గుర్తు లేదా అని విజయశాంతి ప్రశ్నించారు.
కేసీఆర్ అబద్దాల ముఖ్యమంత్రి అని విజయశాంతి విమర్శించారు. నాలుగున్నర ఏళ్లుగా అబద్దాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడని ఆమె ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఎందుకు సీఎం పదవి దళితుడికి ఇవ్వలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మరో ఐదేళ్ల పాటు కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే రాష్ట్రం లూటీ అవుతోందని చెప్పారు.
టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మకైనట్టు విజయశాంతి ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్
ఎన్నికలు కలిపాయి ఇద్దరినీ.. ఒకే వేదికపైకి బాలయ్య, విజయశాంతి
పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి
