Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్లు ఒకే పార్టీ(కాంగ్రెస్)లో ఉన్నారు.

congress leader vijayashanthi comments on chiru and pawan
Author
Hyderabad, First Published Oct 4, 2018, 11:19 AM IST

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టిన మహిళా నేత విజయశాంతి. ఒకప్పుడు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. అందిరనీ అలరించిన ఆమె.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి పూర్తిస్థాయి రాజకీయనాయకురాలిగా మారిపోయారు. గత కొంతకాలంగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్న విజయశాంతి.. ముందస్తు ఎన్నికలు దగ్గరపడుతుండటంటో తన ఉనిఖిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి, పవన్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉన్న చిరంజీవి, విజయశాంతి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్లు ఒకే పార్టీ(కాంగ్రెస్)లో ఉన్నారు. తెలంగాణలో వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ ఇంటర్వ్యూలో విజయశాంతిని ప్రశ్నించగా.. ‘నాకు తెలీదు, నా వరకు రాలేదు. ఆంధ్ర నాయకుల గురించి మేం ఆలోచించడం లేదు’ అని అన్నారు. 

మహాకూటమిగా ఏర్పడ్డారు కాబట్టి సినీ రంగానికి చెందిన మీరు, చిరంజీవి, బాలకృష్ణ మరికొందరు కలిసి ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు విజయశాంతి స్పందిస్తూ.. ‘మిగిలిన వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్నారు. వాళ్లు అటు ఆంధ్రలో ఉన్నారు. మేం ఇటు తెలంగాణలో ఉన్నాం. ఎవరి బిజీలో వాళ్లు ఉంటారు. ఎవరి ఆలోచన వాళ్లకు ఉంటుంది. అంతకు మించి తెలీదు’ అని సమాధానం ఇచ్చారు. 

ఇంతకు ముందు తెలంగాణలో పోటీచేస్తామని చెప్పిన జనసేన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, మహాకూటమిలో వాళ్లను కూడా కలుపుకునే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు విజయశాంతి సమాధానమిచ్చారు. కూటమిలో వాళ్లు ఉన్నారా లేదా అనే విషయం తనకు తెలీదని స్పష్టం చేశారు. హై కమాండ్ నిర్ణయం మేరకు చిరంజీవి ప్రచారానికి వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధమే అన్నారు. 

ఇవి కూడా చదవండి

పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి

Follow Us:
Download App:
  • android
  • ios